జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఇవాళ తెలంగాణ మంత్రులు వెళ్లనున్నారు.ఈ మేరకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సందర్శించనున్నారు.
మరికాసేపటిలో హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు మంత్రులు బయలుదేరనున్నారు.ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు అన్నారం బ్యారేజ్ లను పరిశీలించనున్నారు.
తరువాత మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లపై మంత్రులు సమీక్షించనున్నారు.ఈ మేరకు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో మంత్రులు చర్చించనున్నారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.ప్రాజెక్టు వివరాలతో పాటు పాత, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం సంబంధింత విషయాలను అధికారులు పీపీటీలో వివరించనున్నారు.