ప్రశాంత్ వర్మ ( Prashanth Varma ) దర్శకత్వంలో తేజ సజ్జ ( Teja Sajja ) హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నటువంటి చిత్రం హనుమాన్ ఈ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పరీక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లు జాంబిరెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇక హనుమాన్ సినిమా ( Hanuman ) కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
![Telugu Amritha Iyer, Hanuman, Mahabharata, Prashanth Varma, Teja Sajja, Tollywoo Telugu Amritha Iyer, Hanuman, Mahabharata, Prashanth Varma, Teja Sajja, Tollywoo](https://telugustop.com/wp-content/uploads/2024/01/Guntur-Karaam-vs-Hanuman-Movie-Ticket-Prices.jpg)
ఈ సినిమా గుంటూరు కారం ( Gunturu Kaaram ) సినిమాకు పోటీగా విడుదలవుతున్నటువంటి తరుణంలో థియేటర్లను చాలా తక్కువ మొత్తంలో కేటాయించారని తెలుస్తోంది.గుంటూరు కారం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు( Producer Dil Raju ) కొనుగోలు చేశారు.దీనితో హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మొత్తం ఈయన గుంటూరు కారం సినిమాకు లాక్ చేశారు.
కేవలం హనుమాన్ సినిమాకు నాలుగు థియేటర్లు మాత్రమే కేటాయించారు అంటే సినీ నిర్మాత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
![Telugu Amritha Iyer, Hanuman, Mahabharata, Prashanth Varma, Teja Sajja, Tollywoo Telugu Amritha Iyer, Hanuman, Mahabharata, Prashanth Varma, Teja Sajja, Tollywoo](https://telugustop.com/wp-content/uploads/2024/01/Hanuman-Movie-Ticket-Prices-in-Telangana.jpg)
ఇలా థియేటర్లు తక్కువ కేటాయించారని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమా టికెట్ల రేట్లకు( Ticket Rates ) సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.హనుమాన్ సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ దక్కించుకుంది.అయితే టికెట్లపై అదనపు ఛార్జీలేవీ వసూలు చేయడం లేదు.తెలంగాణ మల్టీప్లెక్స్ థియేటర్లలో రాష్ట్రవ్యాప్తంగా టికెట్ ధర రూ.295గా ఉండనుంది.హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్లలో గరిష్ట టికెట్ ధర రూ.150గా ఉంటుంది.ఇక హైదరాబాద్ కాకుండా తెలంగాణలోని మిగిలిన సింగిల్ థియేటర్లలో టికెట్ ధర రూ.110గా( Hanuman Ticket Price ) మూవీ యూనిట్ నిర్ణయించారట.ఇది కేవలం తెలంగాణలో టికెట్ ధరలు మాత్రమే తెలుస్తుంది.మరి ఆంధ్రాలో ఈ సినిమాకు టికెట్ ధరలు ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంది.