బాహుబలి సినిమా( Baahubali movie ) తర్వాత అన్నిటి కన్నా పెద్ద పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ అని బాలీవుడ్( Bollywood ) సైతం ఒప్పుకోవాల్సిన పరిస్థితి.అందుకే ఒక సినిమా వస్తుంది అంటే అది తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలవుతుంది.
కేవలం ఈ రెండు భాషల్లోనే కాదు ఇండియా మొత్తంలో మేజర్ అన్ని భాషల్లో కూడా మన తెలుగు సినిమా విడుదలై వసూళ్లను సాధిస్తుంది.అయితే ఇదంతా ఒకవైపు పెడితే తమిళ సినిమా హీరోలు మాత్రం మరోలా భావించారు.
ఎన్ని రోజుల పాటు వారు బావిలో కప్పలానే ఉన్నారు.వారి భాషలో సినిమాలు తీస్తూ అక్కడే ఉండాలని అనుకున్నారు.
మహా అయితే కొంతమంది హీరోలు తెలుగులో తమ సినిమాలను డబ్బింగ్ చేస్తూ వదులుతారు.కానీ ఇప్పుడు వారిలో కూడా మార్పు మొదలైంది.
ఫ్యాన్ ఇండియా సినిమాలో నటించాలనే కోరిక పుడుతుంది.అందుకే ప్రస్తుతం కొంతమంది హీరోలు బాలీవుడ్ బాట పట్టారు.
ఇంతకీ బాలీవుడ్ లో సినిమాలు తీస్తున్న ఆ హీరోలు ఎవరు? ఎవరితో తీయబోతున్నారు ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రజినీకాంత్( Rajinikanth ) గతంలో రోబో వంటి ఒక సినిమా తీసిన అది హిందీ చిత్రం అంటే ఎవరు ఒప్పుకోరు.దాంట్లో తమిళ వాసన పూర్తిగా కనిపిస్తుంది.అయితే ఇప్పుడు తాజాగా సాజిద్ నడియావాలా( Sajid Nadiawala ) చెప్పిన కథకి రజినీకాంత్ ఓకే చెప్పాడట.
ప్రస్తుతం జ్ఞానవేల్( Jnanavel ) సినిమాలో నటిస్తున్న ఆయన ఆ సినిమా పూర్తవగానే లోకేష్ కనగరాజు చెప్పిన మరో సినిమాకి సిద్ధం కావాల్సి ఉంటుంది.ఆ చిత్రం తర్వాతే హిందీ సినిమా చేయబోతారట రజిని.
సూర్య( surya ) ఇప్పటికే కర్ణ అనే సినిమాతో బాలీవుడ్ బాట పట్టగా ఈ సినిమాను ఓం ప్రకాష్ తెరకెక్కిస్తున్నారు.భారీ బడ్జెట్ తో ఈ చిత్రం వస్తుండగా దీంట్లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

తనను గతంలో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఆనంద్ ఎల్ రాయ్( Anand L Roy ) తో మరో సినిమాలో నటించేందుకు ధనుష్( Dhanush ) సిద్ధం అయిపోతున్నారు.వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం పేరే తేరే ఇష్క్ మెయిన్.ఓవైపు తమిళ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు హిందీ చిత్రాలను కూడా ఒప్పుకుంటున్నాడు ధనుష్.ఇక వీరు మాత్రమే కాకుండా శివ కార్తికేయన్ సైతం హిందీ దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పాడట.
దాని గురించిన పూర్తి సమాచారం అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.