టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా స్టార్ట్ అయిన మొదట్లో నుండి అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇప్పుడు మాత్రం అంచనాలు పీక్స్ కు చేరాయి అనే చెప్పాలి.మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఐడియా సినిమాలో చేస్తుండడం వల్ల సినిమా వేరే రేంజ్ కు వెళ్ళిపోయింది.
ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది.దీంతో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేక పోతుంది.మళ్ళీ ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండడంతో ఈ మధ్యనే షూటింగ్ రీస్టార్ట్ చేసారు.అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.
మొదటి భాగం షూట్ 90 శాతం మేరకు పూర్తి అయ్యింది.

ఈ కొద్దీ భాగాన్ని కూడా పూర్తీ చేసి మొదటి పార్ట్ ను త్వరగా విడుదల చేయాలను సుకుమార్ భావిస్తున్నాడు.అందుకే షూట్ ను వేగవంతం చేసారు.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.
ఈయనకు జోడీగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పుష్ప ఆల్బమ్ పై మంచి హైప్ ఏర్పడింది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ కూడా ఉందని తెలుస్తుంది.ఆ ఐటెం సాంగ్ కోసం సన్నీలియోన్ ను తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే సన్నీలియోన్ ను మేకర్స్ కాంటాక్ట్ అయిన్నట్టు సమాచారం.అయితే ఈ సాంగ్ కోసం ఆమె భారీ అమౌంట్ డిమాండ్ చేస్తుందని టాక్.కేవలం మూడు నిముషాల సాంగ్ కోసం 70 లక్షలు డిమాండ్ చేస్తుందట.
అంత భారీ అమౌంట్ కూడా ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారట.