వామ్మో పుష్ప కోసం ఏకంగా వెయ్యి మందిని రంగంలోకి దింపిన సుకుమార్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన దృష్టిని మొత్తం పుష్ప సినిమాపై పెట్టారు.పాన్ ఇండియా స్థాయి తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తున్నారు.

 Sukumar Brought A Thousand People Into The Field For Pushpa Movie, Puspa Movie,-TeluguStop.com

ఈ సినిమాలో డీ గ్లామర్ లుక్ లో అల్లు అర్జున్ రష్మిక సందడి చేయనున్నారు.ఇదివరకే అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ అత్యధిక వ్యూస్ దక్కించుకొని రికార్డులు సృష్టిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.ఇకపోతే రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.మొదటి పార్ట్ డిసెంబర్ 17 వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు.ఇకపోతే దీపావళి పండుగను పురస్కరించుకొని చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ విడుదల చేశారు.

Telugu @pushpamovie, Allu Arjun, Devi Sri Prasad, Mass, Pushpa Diwali, Pushpa, P

తాజాగా ఈ సినిమాలో మరొక పాటను చిత్రీకరించనున్నట్లు చిత్రబృందం ఈ పాటకు సంబంధించిన ఫోటోను విడుదల చేశారు.ఇందులో అల్లు అర్జున్ బుల్లెట్ పై కూర్చుని కనిపిస్తుండడంతో ఈ పాట మాస్ సాంగ్ అయి ఉంటుందని తెలుస్తోంది.ఇక ఈ పాట కోసం సుకుమార్ ఏకంగా 1000 మంది డాన్సర్ లను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.మొత్తానికి ఈ పాట సినిమాకి ఎంతో హైలెట్ కానుందని ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది.

మొత్తానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, సుకుమార్ డైరెక్షన్ అల్లు అర్జున్ కు మరొక హ్యాట్రిక్ ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube