ఆరేళ్లు.. వరుసగా ఆరు బ్లాక్ బస్టర్ హిట్లు.. చిరంజీవి స్టామినా ఇదే?

మెగాస్టార్ చిరంజీవికి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.దాదాపుగా 40 సంవత్సరాల నుంచి చిరంజీవి హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.1987 సంవత్సరం నుంచి 1992 సంవత్సరం వరకు చిరంజీవి నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచారు.ఆరు సంవత్సరాల కాలంలో చిరంజీవి ఖాతాలో ఆరు బ్లాక్ బస్టర్ హిట్లు చేరడం గమనార్హం.

 Star Hero Chiranjeevi Back To Back Block Buster Hits Details Here, Star Hero , C-TeluguStop.com

ఈ ఆరు సినిమాలలో రెండు సినిమాలకు కోదండరామిరెడ్డి దర్శకుడు కాగా మరో రెండు సినిమాలకు రాఘవేంద్రరావు దర్శకుడు కాగా మిగిలిన రెండు సినిమాలలో ఒక సినిమాకు విజయ బాపినీడు దర్శకుడు కాగా మరో సినిమాకు రవిరాజా పినిశెట్టి డైరెక్టర్ కావడం గమనార్హం.భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన పసివాడి ప్రాణం సినిమాలో నటించి ఈ సినిమాతో చిరంజీవి తన మార్కెట్ ను ఊహించని స్థాయిలో పెంచుకున్నారు.

Telugu Athakiyamudu, Blockbusters, Chiranjeevi, Gang, Pasivadi Pranam, Yamudiki

చిరంజీవికి జోడీగా విజయశాంతి ఈ సినిమాలో నటించారు.బేబీ సుజిత ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.దర్శకుడు కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.చిరంజీవి నటించిన యముడికి మొగుడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.రవిరాజా పినిశెట్టికి ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కింది.ఆ తర్వాత చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Telugu Athakiyamudu, Blockbusters, Chiranjeevi, Gang, Pasivadi Pranam, Yamudiki

చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంది.చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఆ తర్వాత చిరంజీవి హీరోగా విజయ బాపినీడు డైరెక్షన్ లో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

ఆ తర్వాత చిరంజీవి నటించిన ఘరానా మొగుడు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు 10 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube