శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించినటువంటి తాజా చిత్రం ఓం భీమ్ బుష్( Om Bheem Bush ) .ఈ సినిమా కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఎన్నో అంచనాల నడుమ నేడు మార్చి 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా కథ ఏంటి అసలు ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే…
కథ:
క్రిష్ (శ్రీవిష్ణు),( Sri Vishnu ) వినయ్ (ప్రియదర్శి),( Priyadarshi ) మాధవ్ (రాహుల్ రామకృష్ణ)( Rahul Ramakrishna ) మంచి ఫ్రెండ్స్.ఐతే, లైఫ్ లో సీరియస్ నెస్ లేకుండా తోచింది చేస్తూ.
అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.ఇలా ఈ ముగ్గురు స్నేహితులు పిహెచ్డి పూర్తి చేయాలని దాదాపు పది సంవత్సరాల పాటు ఒకే యునివర్సిటీలో రీసెర్చ్ చేస్తూ ఉంటారు కానీ ఈ ముగ్గురిని యూనివర్సిటీ నుంచి బయటకు పంపించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అలా నాటికీయాలలో భాగంగా ఈ ముగ్గురు అనుకోకుండా ఒక ఊరికి వెళ్లాల్సి వస్తుంది.
భైరవపురం అనే గ్రామానికి వెళ్లిన వీరికి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గుర్ని ఎలా మార్చాయి ?, అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు ?, ఇంతకీ, ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దెయ్యం ఎవరు ?, ఆ దెయ్యానికి – క్రిష్ కి ఉన్న సంబంధం ఏమిటి ? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన:
శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ నటన హైలెట్ అని చెప్పాలి.ఈ సినిమాకు ఈ ముగ్గురి నటన ఎంతో ప్లస్ పాయింట్ అయింది.ఈ ముగ్గురి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.హీరోయిన్ ప్రీతి ముకుందన్( Preeti Mukundan ) కూడా బాగానే నటించింది.కాకపోతే ఆమె పాత్రకు పెద్దగా నిడివి లేదు.మరో హీరోయిన్ అయేషా ఖాన్( Ayesh Khan ) తన గ్లామర్ తో ఆకట్టుకుంది.
ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసిన ప్రియా వడ్లమాని ఆకట్టుకుంది.ఇలా ప్రతి ఒక్కరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:
టెక్నికల్ పరంగా చూసుకుంటే డైరెక్టర్ శ్రీ హర్ష ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారని చెప్పాలి.సినిమా టేకింగ్ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయి .సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది.అదే విధంగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది.
ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది ఎక్కడ కూడా నిర్మాతలు కాంప్రమైజ్ కాలేదు.

విశ్లేషణ:
కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఫస్ట్ హాఫ్ లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్ తో అలరించారు.సెకండ్ హాఫ్ లో వీరి కాంబినేషన్ లో వచ్చే హారర్ సీన్స్ బాగున్నాయి.
అయితే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చాలా స్లోగా సాగాయని తెలుస్తోంది.ఇక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కథ, టెక్నికల్.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ బోర్ కొట్టే సన్నివేశాలు
బాటమ్ లైన్:
ఈ సినిమాలలో హీరోల మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన క్లైమాక్స్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చాలా స్లోగా సాగడంతో ప్రేక్షకులకు కాస్త బోర్ అనిపిస్తుంది.