విలన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సోనూసూద్.ఇప్పటి వరకు నటుడుగా సోనూసూద్ తెచ్చుకున్న గుర్తింపు ఒక ఎత్తైతే ఈ కరోనా సమయంలో అతను చేసిన సేవా కార్యక్రమాలతో దేశం మొత్తం మీద అందరి దృష్టిని ఆకర్షించారు.
వలస కార్మికులని గమ్య స్థానాలకి చేర్చడం మొదలు కొని అవకాశం దొరికిన ప్రతి సారి సోషల్ మీడియాలో ఎక్కడైనా సమస్యల గురించి వీడియోలు వైరల్ అయిన వాటిపై స్పందిస్తూ తనకి చేతనైన సాయం చేస్తున్నారు.అతను చేస్తున్న సాయంతో దేశం యావత్తు సోనూ సేవలకి సలాం చేస్తుంది.
ఇక బాలీవుడ్ స్టార్ హీరోలైన ఖాన్ లని సైతం బీట్ చేసే విధంగా సోనూ ఇమేజ్ పెరిగిపోయింది.ఇక అతని బయోపిక్ తో సినిమా చేయడానికి కూడా బాలీవుడ్ మేకర్స్ సిద్ధం అవుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోనూసూద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేశారు.
దేశమంతా తనను హీరోగా కొలుస్తున్నారని అయితే తను ఎంత మాత్రం హీరోని కాదని కేవలం మానవత్వం ఉన్న మనిషిగా తనకి తోచిన సాయం అందిస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలిపారు.
ప్రతి ఒక్కరి ప్రేమ, ఆశీర్వాదాలతోనే తన పనులు ఇంత గొప్పగా చేయగలుగుతన్నానని పేర్కొన్నారు.అయితే తనను అభినందించడం మాత్రమే కాకుండా ఇతరులకు సాయం చేయాలని అభిమానులను కోరారు.
అతని జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు కొంత మంది సంప్రదిస్తున్నారని ఆయన తెలిపారు.అందుకు సంతోషిస్తున్నానన్నారు.కానీ ఇలాంటి వాటిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు.ప్రతిరోజూ సాయం కోసం దాదాపు మెయిల్స్ వస్తున్నాయి.
ప్రతిరోజూ కనీసం 30 నుంచి 40 సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను.ఇంకా ఎక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నాను అని వీడియో చెప్పుకొచ్చారు.