శివకార్తికేయన్ డాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

వరుణ్ డాక్టర్ సినిమాతో రీసెంట్ గా తన ఖాతాలో సూపర్ హిట్ వేసుకున్న కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తన నెక్స్ట్ సినిమా డాన్ గా వస్తున్నాడు.సిబి చక్రవర్తి డైరక్షన్ లో వస్తున్న ఈ డాన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రయూనిట్ రిలీజ్ చేశారు.

 Siva Karthikeyan Don First Look Poster Released, Siva Karthikeyan,don Movie, Don-TeluguStop.com

తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గానే ఈ డాన్ సినిమా కూడా వస్తుందని అర్ధమవుతుంది.కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథగా ఈ సినిమా ఉంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.

శివకార్తికేయన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఆల్రెడీ వరుణ్ డాక్టర్ సినిమాలో కూడా ప్రియాంకా నటించింది.

హిట్ పెయిర్ అవడంతో డాన్ సినిమాలో కూడా ఆమెను రిపీట్ చేస్తున్నారు.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ లో సుభాస్కరన్ తో పాటుగా శివ కార్తికేయన్ కూడా నిర్మిస్తున్నారు.

సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.వరుణ్ డాక్టర్ తో హిట్ కొట్టిన శివ కార్తికేయన్ ఈ డాన్ సినిమాతో కూడా అదే రిజల్ట్ అందుకోవాలని ఆశిద్దాం.

తమిళ హీరోలంతా తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టగా ఈ క్రమంలో శివ కార్తికేయన్ కూడా తన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.చూస్తుంటే ఈ డాన్ సినిమాను కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube