తెలుగు ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అద్భుతమైన గాత్రంతో ఆమె పాడిన జానపదాలు, తెలుగు పాటలు మాస్ సాంగ్స్ ఏవైనా సరే శ్రోతలను అమితంగా ఆకట్టుకుంటాయని చెప్పాలి.ఇలా ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న మంగ్లీకి ఎంతో మంచి క్రేజ్ ఉంది.
అయితే ఈమెకు తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో కూడా విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.మంగ్లీ పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కన్నడ వెర్షన్ లో పాడి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇటీవల కన్నడ నటుడు సుదీప్ నటించిన విక్రాంత్ రోణ లోని రక్కమ్మ పాటతో దక్షిణాదిన కూడా క్రేజ్ సంపాదించుకుంది.ఈ పాటతో ఈమె కన్నడ సొంతం చేసుకుంది.
అయితే ఈమెకు కన్నడలో ఎంతోమంది అభిమానులు పెరిగిపోవడమే కాకుండా తాజాగా కన్నడ అభిమానులు ఈమెను ఓ కార్యక్రమానికి ఏకంగా పల్లకిలో మోసుకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఇలా మంగ్లీని పల్లకిలో మోసుకొస్తున్నటువంటి ఒక వీడియోని ఈమె తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.
ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే మంగ్లీ పల్లకి వీడియోని షేర్ చేస్తూ.మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉంది పట్టలేని ఆనందంలో ఉన్నాను.కన్నడ బంధుగులు (కన్నడ బంధువులు) అందరికీ థ్యాంక్స్’ అంటూ మురిసిపోయింది.
ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమెకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం అవుతుంది.తాజాగా మంగ్లీ పాడిన రారారకమ్మ అనే పాట ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే.
సోషల్ మీడియాలో ఈ పాటకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.ఈ పాటకు మిలియన్ల కొద్ది లైక్స్ కామెంట్స్ వ్యూస్ రావడం విశేషం.