తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సిద్ధార్థ్ దాదాపు తొమ్మిది సంవత్సరాల కాలం నుంచి తెలుగు తెరకు దూరమయ్యారు.తమిళంలో పలు సినిమాలను చేస్తూ తెలుగులో మంచి స్కోప్ ఉన్న కథ దొరికితే తప్పకుండా చేస్తానని చెప్పిన సిద్ధార్థ్ దాదాపు తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ చిత్రం ఈనెల 14వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ లోనే ఉంటున్న సిద్ధార్థ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ వేడుకల్లో భాగంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల తరువాత ఇది నా రీఎంట్రీ సినిమా కాదు, రీ లాంచ్ సినిమా అని తెలియజేశారు.అజయ్ భూపతి దర్శకత్వంలో హీరో శర్వానంద్ తో కలిసి ఒక ఎమోషనల్ సస్పెన్స్ లవ్ స్టోరీ చిత్రంలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సిద్ధార్థ్ తెలిపారు.

ఈ సందర్భంలోనే ఈయన మాట్లాడుతూ ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ సినిమా ద్వారా శర్వా లాంటి ఒక మంచి స్నేహితుడు నాకు దొరికాడు.ఐ లవ్ యు శర్వా అంటూ స్టేజి మీదే తనకు ఐలవ్యూ చెప్పాడు.అదేవిధంగా తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధం విడిపోలేదని, తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ విధమైనటువంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు.సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని బాక్సాఫీస్ వద్ద మహా సముద్రం సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలబడుతుందని ఈ సందర్భంగా సిద్ధార్థ్ మహా సముద్రం సినిమా గురించి తెలియజేశారు.