ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్ “మేమంతా సిద్ధం”( Memantha Siddham ) పేరిట బస్సుయాత్ర చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు “ప్రజాగళం”( Praja Galam ) పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి విజయభేరి”( Varahi Vijayabheri ) పేరిట ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.2014 ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా యి.ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు.ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నారు.
దీంతో తెలుగుదేశం నుండి చాలామంది స్టార్ క్యాంపెనర్లు( Star Campaigners ) ప్రచారం నిర్వహిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి పార్టీ తరఫున ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నాయకురాలు సీనియర్ హీరోయిన్ జయప్రద( Senioor Actress Jayaprada ) తెలియజేశారు.రీసెంట్ గా జయప్రద మాట్లాడుతూ…”ప్రస్తుతం నేను ఉత్తర ప్రదేశ్ లో ఉంటున్నా… ఎప్పటికీ తెలుగు బిడ్డనే.ఇక్కడ ఎన్నికలలో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని ఉంది.
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే నాకు చాలా ఇష్టం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా( AP Special Status ), రాజధాని లేవు.
వాటికోసం పోరాడతాను.ఎవరైతే యువతకు ఉపాధి కల్పిస్తారో.
శాశ్వత రాజధాని కడతారో వారికే నా మద్దతు అని తెలియజేయడం జరిగింది.