మీలో ఒకడిగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Government Whip Adi Srinivas ) అన్నారు.బుధవారం చందుర్తి మండలం జోగపూర్ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనంలో, ఛత్రపతి శివాజీ వర్ధంతి,దొడ్డి కొమురయ్య జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
మొన్నటి ఎన్నికల్లో నా గెలుపులో భాగస్వామ్యమైన జోగాపూర్ ప్రజానీకానికి చందుర్తి మండల ప్రజలకు( Chandurti Mandal ) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.గత ఎన్నికల్లో అటువైపు వ్యాపారవేత్తలు ధనవంతులు డబ్బుల వర్షం కురిపించిన హేమాహేమీలు ఉన్న మీరందరూ నన్ను మీ బిడ్డగా చూసుకుంటూ మీలో ఒకడిగా కలుపుకుంటూ నా గెలుపుకు తోడ్పాటు అందించారని అన్నారు.
గత పాలకులు ఎమ్మెల్యే పదవిని కేవలం వారి హోదాకు చిహ్నంగా వాడుకున్నారే తప్ప మన ప్రాంతం అభివృద్ధికి,ప్రజా సేవ కోసం కాదన్నారు.గత తొమ్మిదిన్నర సంవత్సరములు అధికారంలో ఉండి మన ప్రాంతానికి చేసింది ఏం లేదన్నారు.చందుర్తి మండలాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.2009వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి( CM YS Rajasekhar Reddy )ని మల్యాల కు తీసుకువచ్చి ఇక్కడి రైతాంగానికి ఉపయోగపడే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను మంజూరు చేపించానని గుర్తు చేశారు.
గత తొమ్మదన్నార సంవత్సరాల బీఆర్ఎస్( BRS ) పాలనలో మన ప్రాంతంలో ఒక్క కాలువ కూడా తవ్వలేదని అన్నారు.జోగపూర్ లోని గురునాథం చెరువు, ఆశిరెడ్డిపల్లి పరిధిలోని కొత్త చెరువు,సనుగుల ఎర్ర చెరువు,పటేల్ చెరువు ,కలికోట సూరమ్మ చెరువు నిర్మాణం పట్టించుకోలేదన్నారు.
ఆనాడు చేసిన పనులకు కాంట్రాక్టర్లుకు బిల్లులను కూడా సరిగా చెల్లించలేదని,మేము వచ్చాక చెల్లిచమని అన్నారు… జోగాపూర్ పరిధిలోని రైతులకు వర్షాకాలం ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా కల్వర్డ్ల నిర్మాణం చేపడతామని ,హై లెవల్ వంతెనల నిర్మాణం చేపడతామని అన్నారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అందులో భాగంగా వేములవాడ నియోజకవర్గం( Vemulawada Constituency ) నుండి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానాన్ని అసెంబ్లీ పుస్తకంలో చేర్చారని గుర్తు చేశారు.
త్వరలోనే చందుర్తి మండల పరిధిలోని ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తామన్నారు.రైతు భరోసా పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తుందని ఇప్పటివరకు 5 ఎకరాలోపు రైతు భరోసా ఇచ్చామన్నారు.
గత ప్రభుత్వం ఏప్రిల్ నాటికి రైతుబంధు ఇచ్చిందని కానీ ప్రస్తుత ప్రభుత్వం ముందుగానే రైతు భరోసా ఇస్తుందన్నారు.మా ప్రభుత్వాన్ని కూల్చుతామని బావ బామ్మర్దులు, ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) అంటున్నారని, గత పది సంవత్సరాలు అధికారం అనుభవించి నేడు అధికారం కోల్పోగానే మతిభ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతు ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని ఏం చేయలేరన్నారు.ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడిందని, వేసవికాలం( Summer season ) అయిపోయి వర్షాకాలంలో వర్షాలు పడకుంటే కరువు వచ్చిందంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఇప్పుడు వర్షాలు పడడం లేదని వాళ్ళు చేస్తున్న వాదనలో నిజం లేదన్నారు.
వాళ్ళ మాటలు చూస్తుంటే బావా బామ్మర్దులు కలిసి రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని కంకణం కట్టుకున్నారని అనిపిస్తుందన్నారు.నేను గతంలో చెప్పినట్టుగానే మీలో ఒకడిగా ఉంటూ మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని గత ఎన్నిక సమయంలో కనిపించిన వారు మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నార అని ప్రశ్నించారు.
నేను లోకల్ వాడినని మీ కష్టసుఖాల్లో పాలుపంచుకునే వాడినని అన్నారు.రానున్న రోజుల్లో నియోజకవర్గ పరిధిలో సాగునీటికి, త్రాగునీటికి విద్య వైద్యానికి పెద్ద వేస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు.