ఉమ్మడి విశాఖ జిల్లా పెదబయలు సమస్యల కుంపటిలో కాళీ పోతున్నా కన్నెత్తి చూడని అధికారులు,ప్రజాప్రతినిధులు తమ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిన గిరిజన సంఘం వారికి నమస్కారాలు అంట్టు వారు ఎదుర్కొంటున్న కష్టాలను వెలిబుచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం మారుమూల గ్రామపంచాయతీ లైన ఇంజేరి, గిన్నెలకోట గ్రామాలను గిరిజన సంఘం జిల్లా కమిటీ సందర్శించింది ఈ సందర్భంగా….
గిరిజనులు తము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకోవడం కోసం ఆధార్ కార్డులు,రేషన్ కార్డులు చేతబట్టుకొని గిన్నె గరువు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి 9 గ్రామ ల నుండి ప్రజలు హాజరయ్యారు.సాలేబు, భూసాల గుప్ప, ఇంజేరి, మాలసీతకోట,తళ్ళబు, గిండేలి,సరియవీది,మెట్టగూడ, గినేగరువు,గ్రామాలనుండి ప్రజలు అజరయ్యారు.
ఈసందర్బంలో గ్రామలవారి గా వారి సమస్యలు చెప్పు కోంట్టు మంచినీరు లేక కలుషితమైన నీటిని తాగుతూ,సుదూర ప్రాంతాల నుండి నీళ్లు తెచ్చు కొంటున్నమని,గ్రవిటి ధ్వర వచ్చే నీళ్లు అక్కడక్కడ పైపులు విరిగిపోయి, కన్నలు పడి నీరు రావడం లేదని, బోరు పంపుల ద్వారా నీళ్లు ఇచ్చేదానికి అవకాశమున్నప్పటికి అటువంటి చర్యలకు అధికారులు ప్రయత్నం చేయడం లేదని ఆవేదన చెందారు.తమ పిల్లలకు పదేళ్లు దాటూతున్న రేషన్ కార్డు ఎడింగ్, కొత్త రేషన్ కార్డులు మంజూరు, ఆదర్ ఏడింగులు చాలా ఎక్కువ ఉన్నాయని ఈ సమస్యపై పలుమార్లు వలింటీర్లకు తమవద్ద ఉన్న గుర్తింపు కార్డుల జేరాక్స్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం వారు నిర్లక్ష్యం చేయడం వల్ల మా సమస్యలు యధాతథంగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నరు.
తమ గ్రామాల నుండి మండల కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరం ఉండబట్టి ఎవరికైనా అనారోగ్యం వచ్చినా అలాగే పురిటి నొప్పుల వంటి సమస్యలు వచ్చినప్పుడు అందుబాటులో ఆసుపత్రి లేకపోవడంతో పెదబయలు, గోమంగి, రూడకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నానా కష్టాలు పడి వెళుతున్నామని ఈ సందర్భాలలో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు లేకపోలేదని అన్నారు.అలాగే పోడు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు అనేకమందికి పోడు పట్టాలు లేవని,మరియు ఉపాధి పనులు చేసిన 5 మాస్టర్ ల వరకు నేటికీ డబ్బులు మంజూరు కాలేదని, పాఠశాల అంగన్వాడీ కేంద్రాలలు తమకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవలని అన్నారు.
అర్హులైన పెంక్షన్ దారులు తమ గ్రామాలలో ఉన్నరని ఏదో ఒక చిన్న చిన్న కారణాల రీత్యా పెంక్షన్ కు నోచుకో లేని స్థితి లో ఉన్నారాని అన్నారు.అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వి రాజు మాట్లాడుతూ…….
విద్య,వైద్యం తో పాటు రేషన్, అంగన్వాడి సరుకులు అందు బాటులో తెవాలని పైన తెలిపిఉన్న సమస్యలతో మారుమూల గ్రామాల్లో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని 50 కుటుంబాలకు ఒక వాలింటిర్న్ నియమించి సత్వరం ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చేపీన అధికారులు ప్రభుత్వం ఎక్కడుందని ప్రశ్నించారు.ఇప్పటికైనా మారుమూల ఇంజేరి,గిన్నేలకోట,జమీగూడ గ్రామ పంచాయతీలకు సమగ్రమైన సర్వే నిర్వహించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కారం చెయ్యాలని లేనిపక్షంలో ప్రజలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు.
ఇ కార్యక్రమానికి గిరిజన సంఘం పెదబయలు మండల కమిటీ సభ్యులు జంపరంగి సునీల్ కుమార్,పి.బుజ్జి బాబు,గంగాధరం,తో పాటు వివిధ గ్రామస్తులు పాల్గొన్నారు.