విశాఖపట్నం స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఆజాది కా అమ్మత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి పేరున 125 రూపే నాణాన్ని విడుదల చేయాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పదాల వీరభద్రరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.శనివారం స్థానిక డాబా గార్డెన్స్ విజెఎఫ్ ప్ర్కైబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమ్మత్ మహోత్సవంలో భాగంగా 1897లో జన్మించి 125వ జయంతోత్సవాలు జరుపుకుంటున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరున 125 రూపే వాణాన్ని విడుదల చేసారని అదే సంవత్సరం 1897లోనే జన్మించిన అల్లూరి పేరున 125 రూపే నాణాన్ని అల్లూరి జయంతి జూలై 4లోగా విడుదల చేయాలని ఆయన కోరారు.
అలాగే 2006లో పార్లమెంట్ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, అల్లూరి సీతారామరాజు విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఉండగా ఒక్క ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయబడిందని, ఇప్పటి వరకు అల్లూరి విగ్రహం ఏర్పాటుకు నోచుకోలేదని, ఆర్ధిక ఇబ్బందులు ఉంటే మా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నియమనిబంధనలకు లోబడి ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఏర్పాటు చేయగలమని పలు దఫాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు వ్రాయడం జరిగిందని, ఇప్పటి వరకు అనుమతులు లభించలేదని, ఏ విధమైన సమాధానం లేదని, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జులై 4లోగా 125 రూపే నాణాన్ని విడుదల చేసి, పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని పడాల డిమాండ్ చేసారు.అజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి 126వ జయంతోత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించతల పెట్టినందులకు కేంద్ర ప్రభుత్వానికి పదాల కృతజ్ఞతలు తెలియచేసారు.
అయితే అల్లూరి పుట్టింది.విశాఖజిల్లా పరువారం మండలం పాండ్రంగి గ్రామం, వీర మరణం పొందింది కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం… అయితే అల్లూరి 125వ జయంతోత్సవాలు ప్రారంభోత్సవ సభ భీమవరంలో పెట్టడం అల్లూరి చరిత్ర పట్ల కేంద్ర ప్రభుత్వానికి అవగాహన లేనట్లు అర్థమవుతుందని, భీమవరం సభలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తారని ప్రకటనలు వెలువడుతున్నాయని ఆయన భీమవరం సభలో ప్రసంగించడం వల్ల అల్లూరి చరిత్రకు ఒరిగేదేమి లేదని చిత్తశుద్ధి ఉంటే 126 రూపే నాణాన్ని విడుదల చేసి పార్లమెంట్లో అల్లూరి విగ్రహానికి అనుమతులు ఇవ్వాలని పదాల కోరారు.
ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియచేసారు.ఈ జిల్లాలో అల్లూరి నడయాడి, పోరాటం సాగించిన ప్రాంతాలు ఉన్నాయి.
వీటి అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకొని ప్రత్యేక నిధులు మంజూరు చేసి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని, గిరిజన యువత ఉద్యోగాల నిమిత్తం వలసలు వెళ్లకుండా ఈ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పదాల ముఖ్యమంత్రి జగన్ కు విజ్ఞప్తి చేసారు.అలాగే అల్లూరి చరిత్ర పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని అల్లూరి వాస్తవ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలన్నారు.
అల్లూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా, రాష్ట్రమంతా జరపకుండా తక్కువ నిధులు విడుదల చేసి ఏదో ఒక ప్రాంతంలో తూతూ మంత్రంగా చేస్తున్నారని, ఎక్కువ నిధులు కేటాయించి, రాష్ట్రమంతా నిర్వహించాలని, ప్రభుత్వం తరపున పత్రికలలో ప్రకటనలు ఇవ్వాలన్నారు.రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యాలయాల్లో అల్లూరి చిత్ర పటాలు ఏర్పాటు చేయాలని, కనీసం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాలయాల్లో చిత్రపటాలు పెట్టుటకు మా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేయాలని పదాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తారు.
ఈ పాత్రికేయుల సమావేశంలో విజెఎఫ్ ప్రెస్క్లబ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అల్లూరి చరిత్ర పరిశోధకుడు ఈఎన్ఎస్ బాలు, పబ్లిక్ దినపత్రిక బ్యూరో చీఫ్ యర్రా నాగేశ్వరరావు, ఆదివాసి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గడుతూరి రామ్ గోపాల్, జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి శ్యామలా వరలక్ష్మి, కార్యవర్గ సభ్యుడు ఎఎన్ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.