సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల మధ్య సీక్రెట్ లవ్ నడుస్తూ ఉంటుంది.చాలా వరకు వాటిని బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.
ఇక ఆ లవ్ చేసిన వారిని కూడా పెళ్లి చేసుకుంటారన్న గ్యారెంటీ కూడా ఉండదు.అందుకే తమ లవ్ గురించి బయట పెట్టకుండా రహస్యంగా ప్రేమాయణం చేస్తూ ఉంటారు.
ఇప్పటికీ చాలామంది నటీనటుల మధ్య సీక్రెట్ లవ్ నడిచింది.అయితే హీరోయిన్ ప్రణీత( Pranitha Subhash ) కూడా ఒకప్పుడు ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో( Music Director ) సీక్రెట్ ప్రేమాయణం చేసినట్లు తెలిసింది.
ఇంతకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో వారికి బ్రేకప్ ఎలా జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత.
ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.తొలిసారిగా ఏం పిల్లో.
ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.అలా తర్వాత పలు సినిమాలలో నటించింది.
అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అలా బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో నటించింది.కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది.
ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి తనేంటో నిరూపించుకుంది.కానీ ఏ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కంటే వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకుంది.ప్రణీత ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికీ ప్రతిరోజు సహాయం చేస్తూనే ఉంటుంది.ఇక బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను వివాహం చేసుకుంది.ఇక పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టాక సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చింది.
పైగా ఆ మధ్యనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.పాప పుట్టిన తర్వాత కూడా తన ఫిజిక్ లో ఎటువంటి మార్పులు లేవని చెప్పవచ్చు.ఇంకా తన అందాన్ని రెట్టింపు చేసుకుంటూ సోషల్ మీడియాలో వాటిని బాగా పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది.
అయితే ఇదంతా పక్కనే పెడితే ఇప్పటివరకు ఎటువంటి గాసిప్ లకు లొంగని ప్రణీత గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ ను ప్రేమించిందని తెలిసింది.
ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు దేవిశ్రీప్రసాద్.
( Devisri Prasad ) అత్తారింటికి దారేది సినిమా సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో అది ప్రేమగా మారిందని.దీంతో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారని తెలిసింది.
అయితే ఆ సమయంలో ప్రణీత, త్రివిక్రమ్ కి మధ్య గొడవ జరగడంతో.ప్రణీత ఆ విషయంను మరింత రచ్చ చేయటంతో తనకు ఆమె సెట్ కాదని దేవిశ్రీ తనను వదులుకున్నాడని తెలిసింది.
అలా కొంతకాలం వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరగగా ఆ గొడవ వల్లే బ్రేకప్ జరిగిందని తెలిసింది.ఇక దేవిశ్రీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే.