Ram Charan : రామ్ చరణ్ ఆ డైరెక్టర్లకు అవకాశము ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ తనయుడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్( Ram Charan ) అనతికాలం లోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

 Reason Behind Ram Charan Neglecting Bollywood Directors-TeluguStop.com

ఇక త్రిబుల్ ఆర్ సినిమా( RRR )తో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా ఏంటో చూపించుకున్నాడు.దాంతో ఒక్కసారిగా ఇండియాలో రామ్ చరణ్ నెంబర్ వన్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.

ఇక దాంతో సౌత్ నార్త్ అనే తేడా లేకుండా చాలామంది దర్శకులు రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు.కానీ ప్రస్తుతం రామ్ చరణ్ ఉన్న బిజీ వల్ల ఎవరి కథలు వినడం లేదు.ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుల కథలు( Bollywood Directors ) మాత్రం వినడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.ఎందుకంటే వాళ్లు మనతో సినిమాలు చేయడం కంటే మన ఇమేజ్ ని డామేజ్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Reason Behind Ram Charan Neglecting Bollywood Directors-Ram Charan : రామ�-TeluguStop.com

ఎందుకంటే రీసెంట్ గా ప్రభాస్ తో చేసిన ఆది పురుషు సినిమాతో ఓం రావత్( Om Raut ) ప్రభాస్ ఇమేజ్ ని ఎంతలా డ్యామేజ్ చేశాడో మనం చూశాం.

కాబట్టి బాలీవుడ్ దర్శకులను చాలా వరకు దూరం పెడితేనే మంచిదని రామ్ చరణ్ భావిస్తున్నాడుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఆయన బుచ్చిబాబుతో మరో కొత్త ప్రాజెక్టుని తొందరలోనే సెట్స్ మీదకి తీసుకువెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి… అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక గేమ్ చేంజర్ సినిమాని( Game Changer ) ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు.ఇక మొత్తానికైతే ప్రస్తుతం రామ్ చరణ్ ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో గా ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube