YS Sharmila : చంద్రబాబు, వైయస్ జగన్ లపై వైయస్ షర్మిల సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జిల్లాల పర్యటన చేపడుతున్న సంగతి తెలిసిందే.2024 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి షర్మిల తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఉంది.ఒకపక్క కొడుకు రాజారెడ్డి పెళ్లికి పది రోజులు సమయం లేకపోయినా గాని కాంగ్రెస్ పార్టీ( Congress Party )కి మైలేజ్ వచ్చే విధంగా ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది.దీనిలో భాగంగా ఫిబ్రవరి 8వ తారీకు గురువారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పోతునూరు గ్రామంలో రచ్చబండ నిర్వహించారు.

 Ys Sharmila Serious Comments On Chandrababu And Ys Jagan-TeluguStop.com


ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్( YS Jagan ) మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు లపై షర్మిల సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ప్రత్యేక హోదా విషయంలో అంశంపై ఇద్దరు దొందూ దొందే అని విమర్శించారు.సీఎం జగన్ ప్రత్యేక హోదా( AP Special Status ) ఎంతో అవసరమని అధికారంలోకి రాకముందు అనేక కార్యక్రమాలు దీక్షలు చేశారు.అయితే అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా కోసం ఒక న్యాయమైన దీక్ష చేశారా అని నిలదీశారు.

ప్రత్యేక హోదా కోసం ముక్కుమాడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడెందుకు రాజీనామాలు చేయడం లేదని వైయస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే విభజన హామీలు నెరవేరుస్తామని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో మొట్టమొదటి సంతకం చేస్తారని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube