మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహెల్ ( Rahel )ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు నాంపల్లి కోర్టులో( Nampally Court ) పిటిషన్ వేశారు.
హైదరాబాద్ లోని ప్రజాభవన్( Praja Bhavan ) ముందు బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో రహెల్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసుతో పాటు గతంలో జూబ్లీహిల్స్ ప్రమాద ఘటనలోనూ రహెల్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు.
ఈ రెండు కేసుల్లో రహెల్ ను విచారించాల్సి ఉందన్న పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.మరోవైపు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రహెల్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో కస్టడీ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ఉంది.