భువనగిరి నేతలతో నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

యాదాద్రి భువనగిరి జిల్లా: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది.ఒకవైపు నుంచి బీజేపీ,బీఆర్​ఎస్​ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టగా ఆ రెండు పార్టీల దూకుడుకు కళ్లెం వేసేందుకు హస్తం పార్టీ ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది.

 Cm Revanth Reddy Review With Bhuvanagiri Leaders Today, Cm Revanth Reddy , Bhuva-TeluguStop.com

ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కార్యకర్తలను,నేతలను మేల్కొపుతూ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్​ రెడ్డి వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు.అయితే, నేడు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్​ రెడ్డి స‌మీక్ష నిర్వహించనున్నారు.

ఆ పార్లమెంటు ఇంఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరగనున్నది.ఈ సమీక్ష మీటింగ్​కు సీఎం రేవంత్​ రెడ్డి హాజరు కానున్నట్లు కాంగ్రెస్​ వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశంలో భువనగిరి లోక్​ సభ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేశం,మల్​రెడ్డి రంగారెడ్డి,బీర్ల ఐలయ్య లతో పాటు ముఖ్య నాయకులతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నియమితులైన కో ఆర్డినేటర్లు కూడా హాజరు కానున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube