భువనగిరి నేతలతో నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

యాదాద్రి భువనగిరి జిల్లా: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది.

ఒకవైపు నుంచి బీజేపీ,బీఆర్​ఎస్​ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టగా ఆ రెండు పార్టీల దూకుడుకు కళ్లెం వేసేందుకు హస్తం పార్టీ ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది.

ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కార్యకర్తలను,నేతలను మేల్కొపుతూ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్​ రెడ్డి వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు.

అయితే, నేడు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్​ రెడ్డి స‌మీక్ష నిర్వహించనున్నారు.

ఆ పార్లమెంటు ఇంఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరగనున్నది.

ఈ సమీక్ష మీటింగ్​కు సీఎం రేవంత్​ రెడ్డి హాజరు కానున్నట్లు కాంగ్రెస్​ వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశంలో భువనగిరి లోక్​ సభ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేశం,మల్​రెడ్డి రంగారెడ్డి,బీర్ల ఐలయ్య లతో పాటు ముఖ్య నాయకులతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నియమితులైన కో ఆర్డినేటర్లు కూడా హాజరు కానున్నట్లు సమాచారం.

రేవతి మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేయడం రైటేనా.. నెటిజన్ల అభిప్రాయమిదే!