ఇక ప్రతినెల మొదటి ఆదివారం వైజాగ్ బీచ్ క్లీనింగ్
ఆర్కె బీచ్.జోడు గుల్లపాలెం వద్ద చెత్త నెత్తిన సీపీ శ్రీకాంత్ జిల్లా కలెక్టర్ మల్లికార్జున … విశాఖ నగరాన్ని పరిశుభ్రం నగరంగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు.
ఈ మేరకు ప్రతి నెల మొదటి ఆదివారం బీచ్ క్లీనింగ్ చేపట్టాలని ప్రతిపాదన చేశారు .అందులో భాగంగా ఈరోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య ఆర్కే బీచ్ నుంచి జోడు గుల్లపాలెం వరకు వ్యర్ధాలను తొలగించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ తో సహా పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఈ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇకపై ప్రతి నెల మొదటి ఆదివారం బీచ్ క్లీనింగ్ చేపట్టాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో బీచ్ స్థానికులతో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విశాఖ నగరానికి ప్రతిష్టాత్మకమైన తీరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత విశాఖ పౌరులపై ఉందని నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ పేర్కొన్నారు పెద్ద ఎత్తున జరిగిన ఈ బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో విశాఖ నగర పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు …
.