ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త అందించారు.గతంలో సామాజిక పెన్షన్లను పెంచుతామని చెప్పిన హామీ మేరకు పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాగా పెరిగిన పెన్షన్లు జనవరి 1వ తేదీ నుంచి అమలుకానుంది.ప్రభుత్వ తాజా ఉత్తర్వుల మేరకు వృద్ధులు, వితంతువులతో పాటు ఒంటరి మహిళ, చేతి వృత్తిదారులకు పింఛన్ పెరగనుంది.