రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ పట్టణంలోని గాయత్రి మాత మందిరానికి( Gayatri Mata Mandir ) ప్రముఖ ఎన్నారై, డాక్టర్ తోట రాంకుమార్ లక్ష రూపాయల విరాళం అందజేశారు.గాయత్రి మాత ఆలయం చైర్మన్ గా కొనసాగుతున్న గతంలోనూ ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసిన డాక్టర్ తోట రామ్ కుమార్(Thota Ram Kumar ) మరికొన్ని నిధులు అవసరం ఉన్నాయని ఆలయ ప్రతినిధులు కోరడంతో గురువారం నాడు మరో లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.
అడగగానే అదనంగా లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చిన తోట రాంకుమార్ కు ఆలయ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు ముప్పిడి అహల్య, నునుగొండ అమృత, బూరుగు అరుణ, బింగి రాజేశ్వర, సనుగుల లింబాద్రి, విక్కుర్తి శంకరయ్య, సనుగుల భాస్కర్, కముటాల వేణు, గోపు బాలరాజు, ఉప్పుల దేవరాజు తదితరులు పాల్గొన్నారు.