తెలుగులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించినటువంటి “రంగస్థలం” చిత్రంలో “ఈసారి ప్రెసిడెంట్ ఎలక్షన్లలో నేను పోటీ చేస్తా” అంటూ డైలాగులు చెబుతూ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి నోయల్ సీన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఇతడు ఒకపక్క పలు చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తూనే మరోపక్క పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ వంటివి చేస్తున్నాడు.
కాగా తాజాగా నోయల్ సీన్ పాడిన టువంటి డెలివరీ బాయ్ సాంగ్ యూట్యూబ్ లో 2.36 నిమిషాల నిడివితో లీక్ అయింది.కాగా ఈ పాటని అందరూ చూడాలంటూ టాలీవుడ్ సింగర్ మరియు బిగ్ బాస్ 3 వ సీజన్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులను కోరాడు.అంతేగాక సింగర్ నోయల్ సీన్ కి కూడా సపోర్ట్ చేయాలని కోరాడు.
దీంతో ప్రస్తుతం డెలివరీ బాయ్ పాట యూట్యూబ్ లో బాగానే ట్రెండింగ్ అవుతోంది.

అలాగే కొందరు నెటిజన్లు మరియు నోయెల్ సీన్ అభిమానులు ఈ పాటను సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగానే వైరల్ చేస్తున్నారు. కాగా ఈ పాటని చేసిన గంటల్లోనే మంచి స్పందన వచ్చింది. గతంలో రాహుల్ సిప్లిగుంజ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ 3 సీజన్ లో పాల్గొన్న సమయంలో నోయాల్ సీన్ బాగానే సపోర్ట్ చేశాడు.
అందువల్లే రాహుల్ సిప్లిగంజ్ నోయల్ సీన్ పాట ప్రమోషన్లో సహాయం చేసినట్లు తెలుస్తోంది.