ఇటీవలే కాలంలో చాట్ జీపీటీ( Chat GPT ) ఎక్కువగా వినిపిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా ఉండే పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ చాట్ జీపీటీ ను రూపొందించిన ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
చాట్ జీపీటీ లో ఉండే ఫీచర్లు యూజర్లకు అవసరమైన సేవలు అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి.ఈ క్రమంలోనే చాట్ జీపీటీ యూజర్ల కోసం ఓపెన్ ఏఐ సంస్థ సరికొత్తగా వాయిస్ ఫీచర్ ను తీసుకువచ్చింది.
ఆ వాయిస్ ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.ప్రస్తుతం చాట్ జీపీటీని వాడే యూజర్లకు కేవలం టెక్స్ట్ ఫీచర్ మాత్రమే అందుబాటులో ఉండేది.
ఇప్పుడు వాయిస్ ఫీచర్ ( voice feature )ద్వారా మాట్లాడుకునే సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.వాయిస్ ఇన్ పుట్స్ అందించి యూజర్లు అవసరమైన సమాచారం పొందవచ్చు.
![Telugu Chat Gpt, Openai, Smart Phone, Text-Technology Telugu Telugu Chat Gpt, Openai, Smart Phone, Text-Technology Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/11/Chat-GPT-voice-feature-OpenAI-technology-news.jpg)
ఈ వాయిస్ ఫీచర్ ఉపయోగించాలంటే ముందుగా స్మార్ట్ ఫోన్ లో యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.ఆ తర్వాత హెడ్ ఫోన్ ఐకాన్ కోసం సర్చ్ చేసి, ఆ ఐకాన్ పై ట్యాప్ చేస్తే వాయిస్ చాటింగ్ ఫీచర్ ఆక్టివేట్ అవుతుంది.ఈ ఫీచర్ ఆక్టివేట్ అయిన తర్వాత టెక్స్ట్ టైప్ చేయడానికి బదులుగా వినియోగదారులు చాట్ జీపీటీ మాట్లాడవచ్చు.
![Telugu Chat Gpt, Openai, Smart Phone, Text-Technology Telugu Telugu Chat Gpt, Openai, Smart Phone, Text-Technology Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/11/Chat-GPT-voice-feature-Text-OpenAI-technology-Communication-tec.jpg)
యూజర్లు తమ ప్రాధాన్యతల ఆధారంగా ఎంచుకోవడం కోసం ఐదు విభిన్న వాయిస్ లను చాట్ జీపీటీ అందిస్తుంది.యూజర్ మాట్లాడే పదాలను చాట్ జీపీటీ అర్థం చేసుకోగలిగే టెక్స్ట్ గా మార్చడానికి ఓపెన్ ఏఐ కంపెనీ( OpenAI ) ప్రత్యేక విస్పర్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టంను ఉపయోగించింది.ఈ ఫీచర్ ప్రతి ఒక్క యూజర్ కి అర్థమయ్యేలా ఉంటుంది.
ఈ వాయిస్ ఫీచర్ ను రూపొందించడానికి ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్స్ తో కలిసి ఓపెన్ ఏఐ సంస్థ పని చేసింది.ప్రతి ఒక్క యూజర్ కి సులభంగా కమ్యూనికేషన్ ని అందించేలా విభిన్న అప్లికేషన్లలో యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడం కోసమే ఈ వాయిస్ ఫీచర్ ను సరికొత్తగా ఓపెన్ ఏఐ సంస్థ తీసుకువచ్చింది.