Adipurush Thor: లంక సీన్ తోర్ సినిమా నుంచి కాపీ చేశారా.. నెట్టింట్లో ఓం రౌత్ ను ఆడేసుకుంటున్న నెటిజన్స్?

ఒక సినిమా చేయాలి అంటే దర్శక నిర్మాతలు ఆ సినిమా కోసం భారీగా ప్లాన్ చేసుకోవటం ఎక్కువ పెట్టుబడి పెట్టడం సినిమా పాత్రకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకోవడం లాంటివి పెద్ద టాస్క్ అని చెప్పాలి.నిజానికి ఒక సినిమా చేయాలి అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

 Netizens Trolls Prabhas Adipurush Lanka Scene Copied From Thor Movie-TeluguStop.com

అందరూ కలిస్తేనే ఒక సినిమా చేయవచ్చు.అయితే కొన్నిసార్లు సొంత కథలను ఎంచుకున్నప్పటికీ కూడా కొంతమంది దర్శకులు కాపీ లాంటివి చేస్తూ ఉంటారు.

అది సన్నివేశాలలోనైనా, లేక ఏదైనా సెట్ పరంగా నైనా కొంతమంది దర్శక నిర్మాతలు కాపీ చేస్తూ ఉంటారు.మామూలుగా తమకు కావలసిన ఏదైనా సెట్ ఒకచోట ఉంటే వెంటనే అక్కడికి వెళ్లి షూట్ చేయించుకుంటూ ఉంటారు.

ఇక పెద్ద పెద్ద సినిమాల విషయంలో మాత్రం కచ్చితంగా భారీ భారీ సెట్ ను వేయాల్సి వస్తుంది.దానికి ఎంత ఖర్చైనా సరే కచ్చితంగా పెట్టుకోవాల్సిందే.

కానీ కొంతమంది దర్శక నిర్మాతలు తమ సినిమాకు కావాల్సిన బ్యాగ్రౌండ్ సెట్ ఇతర సినిమాలకు వేసిన సెట్ లలో వెళ్లి షూట్ చేస్తూ ఉంటారు.అలా చిన్న సినిమాలు కాఫీ చేస్తే ఏమీ అనిపించదు కానీ పెద్ద పెద్ద సినిమాలు కాపీ చేస్తే మాత్రం బాగా ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.అయితే ఇప్పుడు ఏకంగా ఒక సినిమాలోని సన్నివేశాన్ని ఆదిపురుష్ సినిమాకు( Adipurush Movie ) కాపీ చేశారు అని నెట్టింట్లో బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన ఆది పురుష్ రామాయణం నేపథ్యంలో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేశారు సినీ బృందం.ఏకంగా 700 కోట్ల ఖర్చు చేసి సినిమా తీసినట్లు తెలిసింది.అలా బడ్జెట్ పరంగా కూడా సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఇప్పటికే రామాయణం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా త్రీడిలో ఉంటుంది అని తెలియటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై బాగా హోప్స్ పెట్టుకున్నారు.

కానీ సినిమా విడుదల తర్వాత ఎవరు కూడా ఈ సినిమా గురించి ప్లస్ గా మాట్లాడినట్టు కనిపించలేదు.చాలావరకు ఆ సినిమాలోని క్యారెక్టర్స్ పై ట్రోల్స్ ఎదురవుతున్నాయి.ఇప్పటికే అందులో ఒక వానరుడు అచ్చం అల్లు అర్జున్ లాగా ఉన్నాడు అని.ప్రభాస్ లుక్ జీసస్ లాగా ఉంది అని కామెంట్లు చేశారు.అయితే ఈ సినిమా నుండి తాజాగా మరో విషయాన్నీ పసిగట్టారు జనాలు.

అదేంటంటే ఈ సినిమాలో చూపించిన లంక సీన్ ను కాపీ చేసినట్లు కనిపించింది.ఏకంగా అది తోర్ సినిమా( Thor Movie ) నుంచి కాపీ చేశారు అని.డైరెక్టర్ ఓం రౌత్ ను( Om Raut ) జనాలు బాగా ఆడేసుకుంటున్నారు.700 కోట్లు పెట్టి సినిమా తీశారు అన్నారు.చూస్తే మొత్తం కాపీయే ఉంది.అన్ని కోట్లు ఖర్చుపెట్టినట్లు ఎక్కడ కనిపించలేదు అంటూ జనాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.దీంతో లంక సీన్ గురించి ప్రస్తుతం ట్విట్టర్లో బాగా వైరల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube