న్యాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాని సినిమా విడుదలైతే టాక్ తో సంబంధం లేకుండా మినిమం గ్యారంటీ కలెక్షన్లు వస్తాయని చాలామంది భావిస్తారు.
ఒక సందర్భంలో నాని మాట్లాడుతూ సినిమాసినిమాకు బోలెడన్ని విషయాలు నేర్చుకుంటున్నానని అన్నారు.నేను నటించే సినిమాలు నా కెరీర్ కు ఎంత ప్లస్ అవుతాయనే లెక్కలను నేను పెద్దగా పట్టించుకోనని ఆయన అన్నారు.
నాకు వ్యక్తిగతంగా పిల్ల జమిందార్ చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా అని నాని కామెంట్లు చేశారు.ఏదైనా సినిమాలో నటించే ఆఫర్ పోయినంత మాత్రాన నేను ఫీల్ కానని ఆయన చెప్పుకొచ్చారు.
కాలేజ్ లో నేను సరిగ్గా చదివేవాడిని కాదని కాలేజ్ బంక్ కొట్టి థియేటర్లలో సినిమాలు చూస్తూ ఉండేవాడినని నాని చెప్పుకొచ్చారు.అమ్మాయిలలో కూడా ఫ్రెండ్స్ ఉండేవారని నాని వెల్లడించడం గమనార్హం.
లవ్ లెటర్స్ ఎప్పుడూ రాయలేదని లవ్ లెటర్స్ కూడా రాలేదని ఆయన కామెంట్లు చేశారు.నా బలం సినిమా అని నా బలహీనత కూడా సినిమా అని నాని కామెంట్లు చేశారు.

నేను సినిమా తప్ప ఏం చేయలేనని నాని వెల్లడించారు.రాజమౌళి డైరెక్షన్ లో నేను నటించడం చాలా సంతోషం కలిగించిందని నాని తెలిపారు.నేను పదో తరగతిలో ఉన్న సమయంలో ఇద్దరు మిత్రులు సినిమా విడుదలైందని ఆ సినిమా సమయంలో సైకిల్ పోగొట్టుకున్నానని ఆయన తెలిపారు.
అయితే నేను ఇంట్లోనే సైకిల్ పెట్టి పోయానని చెప్పి పేరెంట్స్ ను నమ్మించానని నాని అన్నారు.
డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పని చేసిన నేను నా కథతో ఎవరినైనా ఒప్పించగలనని ఆయన తెలిపారు.కమల్ హాసన్ గారిని డైరెక్ట్ చేయాలని కోరిక అని ఆయన వెల్లడించారు.
ఒక యాడ్ ఫిల్మ్ ద్వారా అష్టాచమ్మా సినిమాలో నాకు ఛాన్స్ వచ్చిందని నాని చెప్పుకొచ్చారు.