విశాఖ నగరంలో ఈ నెల 22న శ్రీమతి వైజాగ్ కాంటెస్ట్ కి సంబంధించిన ఆడిషన్స్ జరగనున్నాయి.ఈ మేరకు దొండపర్తిలో గల బెస్ట్ వెస్ట్రన్ హోటల్ లో శనివారం కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ ను ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.
రేస్ ఎంటర్టైన్మెంట్స్, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈవెంట్ మేనేజర్లు దాడి రవి కుమార్, అషరఫ్ ఖాన్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ అధినేత అడపాక ఫణీంద్ర కుమార్ మెయిన్ స్పాన్సర్ గా నిలిచారు.ఆయనతోపాటు బెస్ట్ వెస్ట్రన్ హోటల్ ఎండి శ్రీకాంత్, జెడి ఫ్యాషన్స్ టెక్నాలజీ ఎండి కట్టమూరి ప్రదీప్, ఐ రిష్ డెంటల్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ పూర్ణిమ, హాలిడే వరల్డ్ ప్రతినిధి లక్ష్మి ప్రియ ప్రో సెలూన్ ఎండి సునీత, అజయ్ అగర్వాల్ తదితరులు సహకారం అందజేశారని నిర్వాహకులు వెల్లడించారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణలో సీనియర్ పాత్రికేయులు ఎస్ఎస్ శివశంకర్, వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, వైసిపి మహిళా నేత పేడాడ రమణకుమారి, వర్థమాన సినీ నటుడు దీపక్ సరోజ్, విశాఖకు చెందిన ప్రముఖ మోడల్స్ బోండా సంధ్యారాణి, సౌజన్య, శిల్ప నాయక్, ముస్కాన్, చరిష్మా తదితరులు పాల్గొన్నారు.ఈ ఈ కాంటెస్ట్ లో ఆసక్తిగల మహిళలు పాల్గొనేందుకు ఈ నెంబర్లను 9393936465, 9948911427 సంప్రదించగలరని కోరారు.