ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిల వస్తే మోస్ట్ వెల్కమ్ అని తెలిపారు.
కాంగ్రెస్ లో చేరి రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామంటే వైఎస్ షర్మిలను స్వాగతిస్తామని గిడుగు రుద్రరాజు అన్నారు.అయితే వైఎస్ షర్మిల తమ పార్టీలోకి వస్తున్నారన్న సమాచారం తనకు తెలియదని పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటామన్నారు.హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపారు.