ఏపీ సీఎం జగన్ కు ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాసిన లేఖ సంచలనంగా మారింది.పార్టీలో ఉన్న సమయంలో తనను కనీసం మనిషిగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖలో పార్టీ కార్యాలయం పెట్టి ఏడు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పని చేశానని వంశీకృష్ణ తెలిపారు.ఈ ఏడేళ్లు కార్యాలయ నిర్వహణతో పాటు సిబ్బంది జీతాలు, జనసమీకరణకు అయిన ఖర్చును సొంతంగా భరించానని తెలిపారు.
పార్టీ కోసం ఖర్చు పెడుతుంటే తన క్వారీ వ్యాపారాన్ని దెబ్బతీశారని వాపోయారు.ఎమ్మెల్యే టికెట్ తో పాటు మేయర్ పదవి ఇవ్వకుండా మోసం చేశారని పెద్దిరెడ్డి ధనుంజయ రెడ్డికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే రెండు రోజుల క్రితం వైసీపీని వీడిన వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.