ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 39వార్డ్ చిలకపేట ఏరియాలో ఉన్న శ్రీ వివేకానంద సంస్థ లో నేత్రపర్వం “శ్రీకృష్ణ జన్మాష్టమి” వేడుకలు కోటి జన్మల పుణ్య ఫలం తొలి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు.భక్తిశ్రద్ధలతో “గోపూజ”అంబరాన్నంటిన బాలకృష్ణుని “ఉయ్యాల సంబరం”.
విశాఖ, పాత నగరంలో ఉన్న వివేకానంద సంస్థలో “శ్రీకృష్ణుని జన్మాష్టమి” వేడుకలు నేత్రపర్వంగా అత్యంత మనోహరంగా జరిగాయి.ప్రముఖ సంఘ సేవకులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు.
స్వామివారిని దర్శించుకున్నారు.ముందుగా భక్తిశ్రద్ధలతో “గోవు”కు పూజలు జరిపారు.
అనంతరం బాలకృష్ణుని ఉయ్యాల సంబరం వేడుకల్లో పాల్గొన్నారు.ప్రశాంత వదనంతో ఉయ్యాల్లో శయనిస్తోన్న బాలకృష్ణుని దివ్య రూపం చూసి ఆయన పరవశించి పోయారు.
స్వామివారిని దర్శించుకున్నంతనే కోటి జన్మల పుణ్యఫలం లభించిందని ఆనందంతో ఉప్పొంగి పోయారు.భక్తితో.“శ్రీ కృష్ణ కీర్తనలు” ఆలపిస్తూ ఉయ్యాల ఊపుతూ, తన్మయత్వం చెందారు.భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సర్వ మానవాళిని చల్లగా చూడాలని వేడుకున్నారు.1008 లడ్డూలతో శ్రీకృష్ణ భగవానుడుకు నైవేధ్యఁ సమర్పించారు.మధ్యాహ్నం శ్రీకృష్ణుని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.అష్టోత్తర శతనామావళి, సంకీర్తనలు ఆలాపన కార్యక్రమాలను భక్తితో నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే తో పాటు శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ఛైర్పర్సన్ శ్రీమతి కొల్లి సింహాచలం, బాబ్జి, ముజీఫ్ ఖాన్, బండారు గజపతి స్వామి, సూరాడ అప్పారావు, సభ్యులు, అధిక సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు.