సీఎం జగన్( CM Jagan ) నిర్వహిస్తున్న “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర శనివారం విజయవాడకు చేరుకుంది.ఈ క్రమంలో సింగ్ నగర్ లో బస్సు పై నుండి అభివాదం ప్రజలకు చేస్తుండగా.
అగంతకులు రాయితో దాడి చేయడం జరిగింది.ఈ క్రమంలో చాలా బలంగా రాయి సీఎం జగన్ ఎడమ కన్నుబొమ్మపై తగలడంతో… రక్తస్రావం జరిగింది.
దీంతో విజయవాడ జీజీహెచ్ లో ప్రధమ చికిత్స తీసుకోవడం జరిగింది.సీఎం జగన్ పై దాడిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు( Minister Karumuri Nageshwara Rao ) ఖండించారు.
ఇది పిరికిపంద చర్య అని అభివర్ణించారు.సీఎం జగన్ కి వస్తున్న ప్రజాదారణ తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ( TDP ) ఈ రకమైన కుట్రకు పాల్పడిందని విమర్శించారు.
సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని నరేంద్ర సెంటర్ లో నిరసన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రిపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం దుర్మార్గమని విమర్శించారు.తెలుగుదేశం పార్టీ గుండాయిజం నశించాలి… చంద్రబాబు( Chandrababu ) డౌన్ డౌన్… పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) డౌన్ డౌన్ .అంటూ నినాదాలు చేశారు.దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉంటే సీఎం జగన్ ముఖంపై వాపు ఉందని.విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని దేశవ్యాప్తంగా చాలామంది ప్రముఖ నేతలు ఖండించారు.