జేపీ నడ్డాపై మంత్రి హరీష్ రావు ఫైర్

బిజెపి నేత జేపీ నడ్డాపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.2016లో నడ్డా ఇచ్చిన హామీలపై ఆయన నిలదీశారు, మీ హామీలు ఏమయ్యాయి అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.మర్రిగూడ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.తెలంగాణ ప్రభుత్వం చౌటుప్పల్ లో 8.2 ఎకరాలు కూడా ఇచ్చింది., నాటి కేంద్ర మంత్రిగా నడ్డా హామీ ఇచ్చి ఆరేళ్లు గడిచింది, ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్కు కేంద్రం నయా పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు.

 Minister Harish Rao Fire On Jp Nadda-TeluguStop.com

మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదన్నారు.అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజాగోడు పట్టని బిజెపి నేతలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగటానికి మునుగోడు వస్తున్నారు అని హరీష్ రావు ప్రశ్నించారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube