ఆ ప్రముఖ నటి బాలయ్యను డాడీ అని పిలుస్తోందట.. మరో కూతురు అంటూ?

స్టార్ హీరో బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా 2023 సంక్రాంతి కానుకగా భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.ఈ సినిమాలో బాలయ్యకు చెల్లి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు.

 Varalaxmi Sharat Kumar Calling Daddy About Balakrishna Details, Balakrishna, Gop-TeluguStop.com

వరలక్ష్మీ శరత్ కుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుండగా బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.

షూటింగ్ సమయంలో బాలయ్యను వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నా అన్నా అని పిలుస్తున్నారని ఆఫ్ స్క్రీన్ లో మాత్రం డాడీ అని పిలుస్తున్నారని సమాచారం.

బాలయ్య వరలక్ష్మీ శరత్ కుమార్ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని తెలుస్తోంది.బాలయ్య కూడా సొంత కూతుళ్లను ఎంత ప్రేమగా చూసుకుంటారో వరలక్ష్మీ శరత్ కుమార్ ను కూడా అంతే ప్రేమగా మరో కూతురిలా చూసుకుంటున్నారని సమాచారం.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే బాలయ్య వరలక్ష్మీ శరత్ కుమార్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కే అవకాశం ఉంది.

Telugu Nbk, Balakrishna, Balakrishna Nbk-Movie

గోపీచంద్ మలినేని ఈ సినిమాలోని సీన్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Telugu Nbk, Balakrishna, Balakrishna Nbk-Movie

గోపీచంద్ మలినేని ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని చాలామంది స్టార్ హీరోలు భావిస్తున్నారు.బాలయ్య ఈ సినిమా కోసం ఏకంగా 18 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారని బోగట్టా.బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను అందుకుంటానని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.బాలయ్య కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube