మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హారి వెంకట కుమారి గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి తో కలిసి మంగళవారం, పాత గాజువాక గ్రామదేవత అమ్మవారు పండగ మహోత్సవాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ గ్రామ దేవతల అమ్మవార్ల దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి, నగర ప్రజలను అన్ని వేళల కాపాడాలని వేడుకున్నట్లుగా తెలియజేశారు.
పార్వతి దేవి ప్రతి గ్రామంలో నూట ఒక్క పేర్లతో గ్రామ పొలిమేరలో వెలిసిందని గ్రామంలోని వారు రోగాల బారిన పడకుండా గ్రామ దేవతలు ప్రజలను కాపాడతానని అందుకు ప్రతి సంవత్సరం విధిగా గ్రామంలోని వారందరూ భక్తిశ్రద్ధలతో పండుగ మహోత్సవాలు జరుపుకుంటామని తెలిపారు.అనంతరం గొల్ల కంచరపాలెం, డాబాగార్డెన్, లో ఉన్న గ్రామ దేవత పండగ మహోత్సవాల్లో స్థానిక కార్పొరేటర్లు బిపిన్ కుమార్ జైన్, సరగడం రాజశేఖర్, ఉరుకుటి చందు తో కలిసి పాల్గున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం పెద్దలు వైయస్ఆర్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.