రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు ఎనిమిది వందల మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతారని తెలిపారు.ఆగస్టు 26వ తేదీన నగరంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.27 28 తేదీలలో సిరిపురం జంక్షన్ లోని వీఎం ఆర్ డి ఎ చిల్డ్రన్స్ ఏరినా లో రెండు రోజులపాటు ప్రతినిధుల సభలు నిర్వహిస్తామని చెప్పారు.ఈ రౌండ్ మహాసభల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతును అణిచి వేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు బుల్డోజర్ లతో నివాసాలను కూల్చే సంస్కృతి ఇప్పుడే చూస్తున్నాను అన్నారు ప్రతిపక్ష నేతల పైన, ప్రశ్నించే సామాన్య ప్రజల పైన దాడులకు దిగుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం కీలకమని చెప్పారు.
ప్రశ్నించే వారు లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం లేదని చెప్పారు.విలేకర్ల సమావేశంలో ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు ఎ జె స్టాలిన్, ఉప ప్రధాన కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, కోశాధికారి ఎం పైడిరాజు, ఎ విమల, కె సత్యనారాయణ ఆచార్య చెంచు సుబ్రహ్మణ్యం, ఎం రామునాయుడు జి ఎస్ జె అచ్యుతరావు తదితరులతో పాటు అధిక సంఖ్యలో ఆహ్వాన సంఘం సభ్యులు పాల్గొన్నారు.