చలపతి రావు( Chalapati Rao ) రీసెంట్ గా గుండెపోటుతో చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.సీనియర్ నటులు ఒకరి తర్వాత ఒకరు మారినిస్తుండడం నిజంగా బాధని కల్గించే విషయం అనే చెప్పాలి…కైకాల సత్యనారాయణ గారు( Kaikala Satyanarayana ) మరణించి 48 గంటలు గడవక ముందే చలపతి రావు గారు చనిపోవడం ఇండస్ట్రీ మొత్తాన్ని బాధించే విషయం అనే చెప్పాలి.
చలపతి రావు చాలా సినిమాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు పొందారు.ఈయన సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో సీనియర్ ఎన్టీఆర్ ( Sr NTR ) సినిమాల్లో ఎక్కువగా నటించేవారు.
ఆ తర్వాత విలన్ గా తనదైన నటనతో నటించి యావత్తు తెలుగు ప్రజలని మెప్పించాడు.సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు 3 తరాల హీరోలతో నటించి ఆ కుటుంబంతో మంచి అనుబంధాన్ని కలిగిన వ్యక్తిగా మంచి పేరు సంపాందించుకున్నారు.
అలాగే చిరంజీవి తో కూడా ఈయనకి మంచి స్నేహ బంధం ఉంది.

చలపతి రావు ఈ వి వి సత్యనారాయణ సినిమా లో ఎక్కువగా చేసేవాడు మొదట్లో విలన్ వేషాలు వేసిన చలపతి రావు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆది సినిమాలో ఎన్టీఆర్ బాబాయ్ గా ఆయన బాగోగులు చూసుకునే పాత్రలో చాలా చక్కగా నటించి మెప్పించాడు.అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ నటులు మొత్తం ఆయన్ని బాబాయ్ అని ముద్దు గా పిలుస్తుంటారు.ఆయన తెర మీద కనిపించిన మొదటి సినిమా గూఢచారి 116 కాగా, చివరిసారి గా స్క్రీన్ మీద కనపడిన సినిమా బంగార్రాజు…

5 దశాబ్దలకి పైగా ఇండస్ట్రీ లో విలన్ గా మెప్పించిన చలపతి రావు గారు సంపాదించినా ఆస్తుల విలువ కేవలం 40 కోట్ల వరకు ఉంటాయని తెలుస్తుంది ఆయన పేరు మీద ఉన్న 2 ఇండ్లు, సిటీ అవుట్ కట్స్ లో ఉన్న కొంత ల్యాండ్ విలువ ప్రస్తుతం ఉన్న రేటు అన్ని కలిపితే 40 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది…చలపతి రావు కొడుకు రవి బాబు మనందరికీ తెలిసినవాడే ఈయన మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసినప్పటికీ ఆ తర్వాత డైరెక్టర్ గా మారి అల్లరి అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ తర్వాత నచ్చావులే, అనసూయ వంటి సినిమాలతో మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు…
.