కువైత్ జాతీయ దినోత్సవం సందర్భంగా అక్కడ వరుసగా సెలవులు రాబోతున్నాయి.కావున అక్కడ ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగే అవకాశం మెండుగా వుంది.
ఈ నేపథ్యంలో కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ… ప్రవాసులు, నివాసితులకు తాజాగా ఓ కీలక సూచనలు చేసింది.ప్రవాసులు, కువైటీలు సదరు ట్రాఫిక్ గైడ్లైన్స్ తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా సూచించింది.
వేడుకల సందర్భంగా వాహనం మొత్తాన్ని కవర్ చేసేలా డెకరేషన్ అస్సలు చేయకూడదని, అదేవిధంగా వాహనం అద్దాలపై పెయింటింగ్స్ వంటివి వేయకూడదని చెప్పింది.
![Telugu International, Kuwait, Kuwait Airways, Kuwait Expats, Kuwaitnational, Kuw Telugu International, Kuwait, Kuwait Airways, Kuwait Expats, Kuwaitnational, Kuw](https://telugustop.com/wp-content/uploads/2023/02/kuwaitis-and-expats-to-follow-traffic-guidelines-on-kuwait-national-day-detailsa.jpg)
ఇక చాలామంది నంబర్ ప్లేట్ పై కూడా స్టిక్కర్స్ అంటిస్తుంటారని, అలా చేయకూడదని… స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలని మంత్రిత్వశాఖ తెలిపింది.అలాగే వాహనాల కిటికీల నుంచి పిల్లలు బయటకు వేలాడడంగాని, తొంగి చూడడం గాని చేయకూడదని పేరెంట్స్ కి కోరింది.ఇదిలాఉంటే.
నేషనల్ డే సందర్భంగా వచ్చిన వరుస సెలవుల కారణంగా ప్రవాసులు, కువైటీలు భారీ మొత్తంలో విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు.దాంతో ఒక్కసారిగా విమాన చార్జీలు భారీగా పెరిగాయని ట్రావెల్ ఏజెన్సీలు తాజాగా పేర్కొన్నాయి.
![Telugu International, Kuwait, Kuwait Airways, Kuwait Expats, Kuwaitnational, Kuw Telugu International, Kuwait, Kuwait Airways, Kuwait Expats, Kuwaitnational, Kuw](https://telugustop.com/wp-content/uploads/2023/02/kuwaitis-and-expats-to-follow-traffic-guidelines-on-kuwait-national-day-detailss.jpg)
ముఖ్యంగా GCC (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాలు ఐనటులవంటి టర్కీ, లండన్, కైరో, బీరూట్ తదితర గమ్యస్థానాలకు ఇపుడు అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది.దీంతో విమాన టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి.ఏకంగా 200 శాతం మేర విమాన టికెట్ల ధరలు పెరిగినట్లు కువైత్ ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు దేశీయ విమానాలకు కూడా అదే స్థాయిలో డిమాండ్ ఉందని కువైత్ ఎయిర్వేస్ అధికారి అయినటువంటి షోరఖ్ అల్-అవధి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.