53 ఏళ్ల క్రితమే సంచలనం సృష్టించిన కృష్ణ సినిమా.. 80 దేశాల్లో బంపర్‌హిట్..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కృష్ణ ( Superstar Krishna ) సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ చాలా డేర్ అండ్ డాషింగ్‌గా వ్యవహరించేవారు.ప్రయోగాత్మక చిత్రాలను తీయడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు.

 Krishna Record 53 Years Before With Mosagallaku Mosagadu Movie Details, Krishna-TeluguStop.com

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎన్నో కొత్త జానర్లను పరిచయం చేసిన ఘనత ఆయనదే.ఎంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ లోనైనా నటించగల గొప్ప నటుడితడు.

అంతేకాదు ఒక సినిమాని చేయాలనుకుంటే దాని వల్ల నష్టాలు వస్తాయా అని అస్సలు ఆలోచించరు.

కృష్ణ ఎన్నో రిస్కీ సినిమాలను తెరకెక్కించి సంచలనాలు సృష్టించాడు.

అలాంటి సినిమాల్లో “అల్లూరి సీతారామరాజు” ( Alluri Seetharama Raju ) ఒకటి.మూవీ ఒక ఎత్తు అతని కెరీర్ లోని సినిమాలు అన్నీ మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు.అయితే ఆ మిగతా సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోదగిన ఒక సినిమా ఉంది.53 ఏళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా ఏకంగా 80 దేశాల్లో రిలీజ్ అయ్యి అన్నిచోట్ల బంపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది.

Telugu Krishna, Krishna Cowboy-Movie

ఆ మూవీ మరేదో కాదు వెస్ట్రన్ యాక్షన్ ఫిలిం మోసగాళ్లకు మోసగాడు.( Mosagallaku Mosagadu ) కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1971లో విడుదలయ్యి తెలుగు ఇండస్ట్రీలో కొత్త పుంతలు తొక్కించింది.ఈ చిత్రంలో కృష్ణ, విజయ నిర్మల, నాగభూషణం, కైకాల సత్యనారాయణ, గుమ్మడి తదితరులు నటించారు.కృష్ణకు ఈ సినిమా తీయాలనే ధైర్యం రావడమే గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చు.

అప్పట్లో ఇలాంటి సినిమాలు చేయడానికి ఎవరూ సాహసం చేసేవారు కాదు.కృష్ణ మాత్రం హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారు, ముఖ్యంగా కౌబాయ్ మూవీలను ఇష్టపడేవారు.‘మెకన్నాస్‌ గోల్డ్‌’, ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమాలు చూశాక తెలుగులోనూ కౌబాయ్ చిత్రం చేయాలనే ఆలోచన కృష్ణకు వచ్చింది.దాంతో ఆరుద్రకు( Arudra ) కథ రెడీ చేయాలని చెప్పారు.

ఆయన చాలా హాలీవుడ్ సినిమాలు( Hollywood Movies ) చూసి, ఇంగ్లీష్ నావెల్స్ చదివి ఒక కథను రెడీ చేసుకున్నారు.

Telugu Krishna, Krishna Cowboy-Movie

ఈ మూవీ ఆడుతుందా లేదా అనే సందేహాలు ఎన్ని ఉన్నా వాటిని పట్టించుకోకుండా కృష్ణ తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్( Padmalaya Studios ) కింద మూవీ నిర్మాణాన్ని ప్రారంభించారు.బికనీర్‌ కోట, శివబాడి టెంపుల్‌, దేవికుంట సాగర్‌, సిమ్లా, రాజస్థాన్‌, టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరించారు.ఈ మూవీ గెటప్స్, కథ విని చాలామంది ఇది ఆడుతుందా? అని పెదవి విరిచేవారు.కృష్ణ మాత్రం నమ్మకంగా ముందుకు సాగేవారు.ఎన్టీఆర్( NTR ) ఒక్కరే ఈ మూవీ బాగా ఆడుతుందని ప్రోత్సహించే కృష్ణను ముందుకు నడిపించారు.చివరికి 1971 ఆగస్టు 27న మోసగాళ్లకు మోసగాడు సినిమా రిలీజై సెన్సేషనల్ హిట్ సాధించింది.ఇంగ్లీష్ సినిమాల నుంచి కథ తీసుకొని మళ్లీ ఇంగ్లీషులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది.

ఇంగ్లీష్ ప్రేక్షకులకు నచ్చేలాగా ఈ సినిమాని కాస్త కుదించారు.

తమిళ్, హిందీ భాషల్లోనూ విడుదల చేసి లాభాలను గడించారు.53 ఏళ్ల క్రితం కలర్‌లో సినిమా నిర్మించాలంటే కనీసం రూ.12 లక్షల వరకు ఖర్చు అయ్యేది.కానీ కృష్ణ రూ.7 లక్షల ఖర్చుతో, 28 రోజుల్లో ‘మోసగాళ్ళకు మోసగాడు’ మూవీ నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube