సినిమా ఇండస్ట్రీలో కొంత సాధించగానే తమను మించిన వారు లేరు అనుకునేవారు కొంతమంది ఉన్నారు.విపరీతమైన ఆటిట్యూడ్ ప్రాబ్లం తో( Attitude Problem ) కనబడిన వారితో వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ టాలీవుడ్ స్టార్స్.
సినిమాల్లో నటిస్తే వాళ్ళు ఏమైనా దేవుళ్ళ…? అంత ఆటిట్యూడ్ ఎందుకు అనేది అర్థం కాదు.వారికి ఉన్న ఆ ఆటిట్యూడ్ ప్రాబ్లం తో పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు కూడా.
అలా టాలీవుడ్ లో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత విపరీతమైన ఆటిట్యూడ్ పెంచుకొని దానిని మీడియా ముందు జనాల ముందు ప్రదర్శించిన వారు కూడా ఉన్నారు.వారు ఎవరు అనే విషయాన్ని ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మోహన్ బాబు
మంచు మోహన్ బాబు( Manchu Mohan Babu ) గురించి ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తానే సినిమాకి దేవుడిని అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు.మాట్లాడిన ప్రతిసారి తనకు గొప్ప నటుడిని అని తన ముందు అందరూ చేతులు కట్టుకొని నిలబడాలని ఎవరైనా ఫోన్ లో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ ఫోన్ కూడా లాక్కుంటాడు.అంత ఆటిట్యూడ్ ఉండడం వల్లే వారు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా మంచి ఫ్యామిలీకి మంచి గౌరవం దక్కడం లేదు.
సీనియర్ హీరో నరేష్
వామ్మో ఈ నటుడిని భరించడం చాలా కష్టం అంటూ ఉంటారు చాలామంది.నరేష్( Naresh ) సినిమాలు సంగతి పక్కన పెడితే పర్సనల్ లైఫ్ లో విపరీతమైన ఆటిట్యూడ్ కలిగి ఉంటాడు.తనంత గొప్పవాడు లేడు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అంతే కాదు తన తల్లి పేరు చెప్పుకొని ఇప్పటికీ పబ్బం గడుపుకుంటూ ఉంటాడు.కాసేపు ఆయన తో మాట్లాడితే జనాలకు పిచ్చెక్కిపోతుంది అంతలా చిరాకు పెట్టిస్తాడు.
అల్లు అరవింద్
అల్లు అరవింద్( Allu Aravind ) సంగతి మామూలుగా ఉండదు ఆయన అల్లు రామలింగయ్య కొడుకు కాబట్టి బతికిపోయాడు.లేకపోతే పెద్ద స్టార్ హీరో అన్నంత బిల్డప్ ఉంటుంది అల్లు అరవింద్ కి.తన కొడుకు విషయంలో కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు.తన కొడుకు కూడా నేషనల్ అవార్డు వచ్చింది.
నయా పైసా ఇచ్చేది లేదు నా ప్రొడక్షన్ నుంచి అంటూ అందరి ముందు ఏదో వాగేస్తూ ఉంటాడు.ఇక బన్నీ పేరు చెప్పుకొని మరికొన్ని ఏళ్లపాటు ఆయన టాలీవుడ్ లో పెత్తనం చేస్తూ ఉంటారు.
దిల్ రాజు
చాలా సౌమ్యంగా చూడ్డానికి ఎంతో స్మార్ట్ గా కనిపించే దిల్ రాజు( Dil Raju ) సైతం మంచి ఆటిట్యూడ్ ప్రాబ్లం కలిగిన వ్యక్తి.ఆయన గురించి ఆయన సినిమాల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకీపారేస్తాడు.ఇటీవల కాలంలో ఆయన సినిమాలు డిజాస్టర్స్ అవుతున్నాయి.ఆ విషయాన్ని కూడా తట్టుకోలేక మీడియాపై విరుచుకుపడుతూ ఉంటాడు.