హన్సిక కొత్త చిత్రం '105 మినిట్స్' గ్లింప్స్ వీడియో లాంచ్ చేసిన కె. కె. సెంథిల్ కుమార్..

హన్సికమొత్వాని కథానాయికగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా”సింగిల్ షాట్సింగిల్ క్యారెక్టర్” తో ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’.చిత్ర గ్లింప్స్ వీడియోని పాపులర్ సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ విడుదల చేస్తూ హాలీవుడ్ లో మాత్రమే ప్రయత్నించిన సింగిల్ షాట్ చిత్రీకరణ కి నేను పెద్ద అభిమాని ని అలా మానవాళ్లెవరు చెయ్యట్లేదు అనుకుంటుండగా ‘105 మినిట్స్‘ రాజు చేసి చూపిస్తున్నారు.

 Https://telugustop.com/wp-content/uploads/2021/11/kk-senthil-kumar-105-minutes-h-TeluguStop.com

కథ కథనం చాలా థ్రిల్లింగ్ గా అనిపించాయి.105 మినిట్స్ సింగిల్ షాట్ అంటే ఒక టెక్నీషియన్ గా అది ఎంత కష్టమో నాకు తెలుసు.మన తెలుగు పరిశ్రమలో ఇలాంటి కొత్త తరం ఆలోచనతో కథలు తెరకెక్కిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది.ఇలాంటి ఒక రిస్కి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి.

అనుక్కున్నట్టుగా తీసిన చిత్ర బృందం అంతటికి ఈ చిత్రం పెద్ద సక్సెస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు, సామ్ సి.యస్ సంగీతంఅందిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలని వేగంగా జరుపుతుంది చిత్ర బృందం.

సాంకేతిక వర్గం:

నిర్మాత – బొమ్మక్ శివ డైరెక్టర్ – రాజు దుస్సా డిఓపి – కిషోర్ బొయిదాపు మ్యూజిక్ – సామ్ సి.యస్ ఆర్ట్ – బ్రహ్మ కడలి ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ – రూపాకిరణ్ గంజి స్టిల్స్ – గుణకర్మే కప్ – డెక్క బాలు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – సురేష్ బాబు పి.ఆర్.ఓ – జి.ఎస్.కె మీడియా పబ్లిసిటీ డిజైనర్ – సుధీర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube