కొంతమంది పిల్లలను చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది.ఏ విషయాన్నీ అయినా ఇలా చెప్పగానే అలా పట్టేస్తారు.
చిన్న తనంలోనే తల్లిదండ్రులకు అర్ధం అవుతుంది.పిల్లలు ఎంత షార్ప్ గా ఉన్నారో కేవలం తల్లిదండ్రులు మాత్రమే గుర్తించగలరు.
ఎందుకంటే ప్రతి క్షణం వారిని కనిపెట్టుకుని ఉండేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే.మనకు ఏదొక సందర్భంలో ఇలాంటి తెలివైన పిల్లలు ఎదురు పడుతూనే ఉంటారు.
వారిని చుస్తే యిట్టె అర్ధం అవుతుంది.వారు ఎంత చురుకుగా ఉన్నారో అయితే అందరి పిల్లలకు వారి టాలెంట్ చిన్న వయసులోనే నిరూపించు కోవడానికి అవకాశం రాదు.
కొంత మంది పిల్లలు మాత్రమే వారికీ ఉన్న టాలెంట్ బయటకు చూపించుకునే అవకాశం వస్తుంది.ఇప్పుడు ఈ బుడ్డోడి తెలివి చుస్తే మీరు కూడా ఆశ్చర్య పోవడం ఖాయం.
ఇంత చిన్న వయసులో అంత తెలివి ఎలా ఉండ అని ప్రతి ఒక్కరు అనకుండా ఉండలేరు.
![Telugu Classboy, Boybhagavath, Memorizechant-Latest News - Telugu Telugu Classboy, Boybhagavath, Memorizechant-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2021/08/700-Verses-Of-Bhagavad-Gita-first-class-boy-learn-bhagavat-geetha.jpg )
ఇప్పుడు మనం చెప్పుకోబోయే పిల్లాడు భగవద్గీత ను మాములుగా కాదు అలవోకగా చెప్పేస్తాడు.మనకు ఒక్కో శ్లోకం చదవడానికి కూడా సరిగ్గా నాలుక తిరిగాడు.అలాంటిది ఈ బుడ్డోడు భగవద్గీత ను అలా కంఠస్థం గా చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
మొదట్లో ఈ పిల్లడు తెలివి చూసి అతడి తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారట.ప్రస్తుతం అతడికి 5 సంవత్సరాలు.
![Telugu Classboy, Boybhagavath, Memorizechant-Latest News - Telugu Telugu Classboy, Boybhagavath, Memorizechant-Latest News - Telugu]( https://telugustop.com/wp-content/uploads/2021/08/learn-bhagavat-geetha-five-years-old-boy-telling-bhagavath-geetha-verses.jpg)
ఒకటో తరగతి చదివే ఆ పిల్లాడు కేవలం రెండు నెలల కాలంలోనే 700 శ్లోకాలను కంఠస్థం చేసుకున్నాడట.ఇంత తక్కువ వయసులోనే అదీ నాలుక కూడా తిరగని శ్లోకాలను కఠస్థంగా చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.అతడు ఈ మధ్య భక్తి టివి లో జరిగిన ఒక ప్రోగ్రాం లో భగవద్గీత లోని శ్లోకాలు కఠస్థంగా చెబుతుంటే అది వింటూ అందరు ఆశ్చర్య పోయారు.ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.