తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అభిమానించే వారిలో నందమూరి తారక రామారావు ఒకరనే సంగతి తెలిసిందే.తెలుగుతో పాటు ఇతర భాషల్లో 400కు పైగా సినిమాలలో నటించిన సీనియర్ ఎన్టీఅర్ కు ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.
ఎన్టీఆర్ ప్రేక్షకులకు నటుడిగా, రాజకీయ నాయకునిగా మాత్రమే సుపరిచితం అయినప్పటికీ ఆయనలో ప్రేక్షకులకు తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయి.
ఏ సందర్భాల్లో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అయ్యి సమస్యను పరిష్కరించడం ఎన్టీఆర్ కే చెల్లుబాటు అయింది.ఎవరికి ఏ కష్టం వచ్చినా సీనియర్ ఎన్టీఆర్ స్పందించే విషయంలో ముందువరసలో ఉండేవారు.1950 సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా సొంత ఊరు అనే సినిమా తెరకెక్కింది.ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో రాజసులోచన నటించారు.ఆరోజు ఒకవైపు షూటింగ్ జరుగుతుంటే మరోవైపు మరో సినిమా కోసం సెట్ నిర్మిస్తున్నారు.
రాజ సులోచన తన షాట్ ను పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో కాలికి ఏదో తగిలిందని అనిపించి ఆ తర్వాత ఎన్టీఆర్ పక్కనే వచ్చి కూర్చున్నారు.ఎన్టీఆర్ అదే సమయంలో కూల్ డ్రింక్ తాగుతుండగా రాజ సులోచన పాదం నుంచి రక్తం రావడం గమనించారు.ఆ తర్వాత ఎన్టీఆర్ చేతిలోని కూల్ డ్రింక్ ను ఆమె పాదంపై కొద్దికొద్దిగా పోశారు.ఆ తర్వాత ఆమె పాదాన్ని చేతిగుడ్డతో ఎన్టీఆర్ ఒత్తారు.
ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పటికీ హీరోయిన్ కాళ్లు పట్టుకుని ఫస్ట్ ఎయిడ్ చేసి గొప్పదనాన్ని చాటుకున్నారు.ఎన్టీఆర్ అలా చేయడంతో అవాక్కైన రాజ సులోచన తాను చుసుకోలేదని చెబుతూ కళ్ల నీళ్లు పెట్టుకున్నారు.అయితే ఎన్టీఆర్ మాత్రం తనదైన స్టైల్ లో ఒక చిరునవ్వు నవ్వారు.అలా ఎన్టీఆర్ తోటి నటీనటుల విషయంలో ఉన్నతంగా ప్రవర్తించేవారు.