ఓటిటిలోకి రాబోతున్న 'విక్రమ్'.. డేట్ ఫిక్స్.. త్వరలోనే స్ట్రీమింగ్..

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్నాడు.చాలా రోజులుగా ఫామ్ లో లేకపోయినా కూడా కమల్ హాసన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.

 Kamal Hasan Vikram Ott Release Date Details, Kamal Haasan, Vikram Movie, Ott Rel-TeluguStop.com

ఈయన సినిమాలు విభిన్నంగా ఉంటాయి.కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.

ఇక తాజాగా కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు.

ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు.

ఈ ముగ్గురు కలయికలో సినిమా రావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు.వారి ఎదురు చూపులు ఫలించేలా సినిమా ఉండడంతో ఫ్యాన్స్ ఖుషీ వ్యక్తం చేస్తున్నారు.

జూన్ 3న రిలీజ్ అయినా ఈ సినిమా అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో హిట్ మూవీగా డిసైడ్ చేసేసారు.సొంత బ్యానర్ లో కమల్ ఈ సినిమాను నిర్మించారు.దీంతో ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.

Telugu Disney Hot, Fahadh Fasil, Kamal Haasan, Ott, Vikram, Vikram Ott-Movie

అందుకే కమల్ చాలా సంతోషంగా ఉన్నాడు.ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న ఇంకా ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు.ఇక థియేటర్ లలో సూపర్ హిట్ అయినా విక్రమ్ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతుంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమా హక్కులను తీసుకున్నారు.

దీంతో ఈ సినిమా స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.జులై 8 నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారని వార్తలు అయితే వసున్నాయి.

త్వరలోనే డేట్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube