ఈరోజు దారులన్నీ పాడేరు అమ్మవారి ఆలయం వైపే లక్ష మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఒడిసా చత్తీస్ ఘడ్ తెలంగాణ నుంచి తరలివచ్చిన భక్తులు …ఆమె చల్లని దీవెనలు ఉంటే చాలు… జీవితమంతా సంతోషం… కడలిలా వచ్చే కష్టాలు కూడా కరిగిపోతాయి… ప్రకృతి చల్లగా దీవిస్తుంది.పంటలు పండుతాయి.
ఆరోగ్యవంతంగా ఈ ఏడాది అంతా ఉంటుంది.ఇది గిరిజన ప్రజల నమ్మకం ఆ నమ్మకంతోనే ఎంత దూరం నుంచి అయినా గిరిజన ప్రాంత ప్రజలు పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు.
మూడురోజుల ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకున్నారు.ఒకప్పుడు ఉమ్మడి విశాఖ ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ముఖ్య కేంద్రం పాడేరులో మోదకొండమ్మ అమ్మవారు కొలువుదీరారు.
చారిత్రాత్మకంగా వనదేవతల ఆత్మార్పణం ద్వారా ఏడుగురు అక్కచెల్లెల్ల పెద్ద అక్క మోదకొండమ్మ అమ్మవారు పాడేరు లో కొలువుదీరినట్టు గిరిజన ప్రజల విశ్వాసం.అమ్మవారి మిగిలిన చెల్లెలు వేర్వేరు ప్రాంతాల్లో వనదేవతలగా భక్తుల పూజలు అందుకుంటారు.
ఈ దశలో వైశాఖ మాసంలో ఏటా జరిగే మూడు రోజుల ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ.అదే సమయంలో భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకొని శుభకార్యాలు చేపడతారు భక్తులు.
ముఖ్యంగా గిరిజన ప్రాంత రైతులు అడవి గిరిపుత్రులు అమ్మవారి జాతర తర్వాత తమ వృత్తులను ప్రారంభిస్తారు.ఆ క్రమంలో అమ్మవారి ఉత్సవాలు మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు.
దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విడుదల చేశారు.దీంతో పాడేరు పట్టణం పరిసరాల్లో భారీ సెట్టింగులు విద్యుత్ దీపాల అలంకరణతో ఉత్సవాలు నిర్వహించారు.
ఉత్సవాల్లో ప్రధానమైన ఘటాల ఊరేగింపు లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.అమ్మవారిని దర్శించుకోవడం ముక్తిదాయకం అని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు.
కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులు మాత్రమే కాక ఈ ప్రాంతం లో ఉద్యోగాలు ఉపాధి కోసం వచ్చిన ఎందరో తిరిగి అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు.అడవి పై ఆధారపడే గిరిజనులకు జంతువుల నుంచి రక్షణ సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండటానికి అమ్మవారి చల్లని ఆశీస్సులు ఉంటాయని భక్తులు పేర్కొంటున్నారు వాస్తవానికి కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించారు.
మూడు సంవత్సరాల విరామం తర్వాత ఉత్సవాలు జరగడంతో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు అదే సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా నిర్వాహకులు చేపట్టారు ఇలా ఉండగా ఉత్సవాల సందర్భంగా విశాఖ పరిసర ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.