దావోస్ సదస్సు ద్వారా ఏపికి పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావం వుందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.విశాఖ లో జరిగిన ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఆ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ పట్నం ఎయిర్ పోర్ట్ నాలుగు విమానాల నుంచి 64 విమానాల స్థాయికి ఎదిగిందన్నారు.18 లక్షలు మంది ప్రయాణీకులు ఇప్పుడు పోకలు సాగిస్తున్నారన్నారు.మలేషియా .బ్యాంక్ కాక్.సింగపూర్ లకు కరోనా సమయంలో ఆగిన విమాన సర్వీసులు పునరుద్ధరణ జరుగుతోందన్నారు.విశాఖ నుంచి కొలంబో కు జూలై నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్న ట్టు ఐటి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు ఈ నెల 22 నుంచి 26 వరకు దావొస్ సదస్సు ద్వారా ఏపీకి పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసం ఉందన్నారు దావొస్ లో 18 అంశాలు పై సదస్సు జరుగుతోందనీ వీటిలో 10 అంశాలు ప్రాధాన్యత గా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందన్నారు.
వ్యవసాయం.పర్యాటకం .విద్య.వైద్యం.
ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు రాష్ట్రానికి షో కేస్ చేసే అవకాసం దావోస్ సదస్సు ద్వారా లభిస్తోందనీ ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.బీచ్ ఐటి అనే నినాదంతో ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తామనీ వైయస్సార్ హయాంలో విశాఖలో ఐటి కి బీజం పడిందనీ వివరించారు.
ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాలన లో మరింత ప్రగతి సాధిస్తోందనీ బీచ్ ఐటి నినాదం విశాఖకు కలిసి వస్తుందని పేర్కొన్నారు.