తెలంగాణ సుసంపన్న రాష్ట్రమని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ అప్పులతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి కూడా జరిగిందని తెలిపారు.
అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఎందుకు మాట్లాడరని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రానికి కాగ్ రిపోర్టు లెక్కలకు తేడా ఉందని చెప్పారు.
కర్ణాటక గురించి ఇచ్చిన లెక్కలకు కాగ్ రిపోర్టు లెక్కలకు కూడా చాలా తేడా ఉందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే తెలంగాణను అప్పుల రాష్ట్రంగా అవమానించడం తగదన్న అక్బరుద్దీన్ ఓవైసీ శ్వేతపత్రం పేరుతో రాష్ట్రాన్ని అవమానించారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో శ్వేతపత్రం ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.