జగన్ లో ధీమా తగ్గుతోందా ? ఎందుకు అలా అన్నారు ..? 

గత కొంతకాలంగా వై నాట్ 175 అనే నినాదాన్ని పదే పదే వినిపిస్తూ వస్తున్న జగన్( YS jagan ) గెలుపు ధీమాతోనే ఉంటూ వస్తున్నారు.పార్టీ శ్రేణులకు ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు.2019 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను 98 శాతం పూర్తి చేశామని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఎటువంటి అవినీతి లేకుండానే అందిస్తున్నామని, నేరుగా వారి ఖాతాలో కే సొమ్ములు జమ చేస్తున్నామని, ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన దాని కంటే ఎక్కువగానే సంక్షేమ ఫలాలను ప్రజలు పొందారని, కచ్చితంగా మళ్ళీ వైసీపీ( YCP )నే అధికారంలోకి వస్తుందని చెబుతూ వస్తున్నారు.

 Is The Slowness Decreasing In Jagan Why Did Say That, Ap Cm Jagan, India Today-TeluguStop.com
Telugu Ap Cm Jagan, Ap, Brs, India, Jaqnasena, Manifesto, Telangana, Welfare Sch

టిడిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు ఏకమై వచ్చినా తాము ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కుని రెండోసారి అధికారం చేపడతామని ప్రకటిస్తూ వస్తున్నారు.కానీ ఆకస్మాత్తుగా జగన్ స్వరంలో మార్పు కనిపిస్తోంది.ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొన్న జగన్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సన్ దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు సమాధానంగా జగన్ మాట్లాడిన మాటలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసాయి
.

Telugu Ap Cm Jagan, Ap, Brs, India, Jaqnasena, Manifesto, Telangana, Welfare Sch

తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు దాదాపు అన్ని నెరవేర్చానని , కాబట్టి ఇప్పుడు తాను ఓడిపోతాననే బాధ లేదని, తానెంతో సంతోషంగా ఉన్నానంటూ జగన్ మాట్లాడిన మాటలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.జగన్ లో గెలుపు ధీమా తగ్గడంతోనే ఈ విధంగా వ్యాఖ్యానించి ఉంటారని , ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్( KCR ) కూడా ఇదే రకమైన కామెంట్స్ చేశారని, ఓడిపోతామని కేసీఆర్ కు ముందుగానే తెలియడంతో, ఆ తరహా వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు జగన్ కూడా అదే రకంగా మాట్లాడుతుండడం పై అనేక అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో పార్టీ క్యాడర్ లో మనోధైర్యం నింపే విధంగా జగన్ మాట్లాడి ఉంటే బాగుండేదని, యాదాలాపంగా జగన్ చేసిన వ్యాఖ్యలు వేరే సంకేతాలు ఇచ్చేలా ఉన్నాయని, సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube