రియల్ మీ నోట్ 50 ( Realme Note 50 )స్మార్ట్ ఫోన్ రూ.6వేల బడ్జెట్ లో లాంఛ్ అయింది.రియల్ మీ లాంచ్ చేసిన మొదటి నోట్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ఇదే.ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఈ స్మార్ట్ ఫోన్ 6.74 అంగుళాల HD+ డిస్ ప్లే తో ఉంటుంది.ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్ మీ UI T ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది.
4GB RAM+64GB స్టోరేజ్( 4GB RAM+64GB Storage ) తో ఉంటుంది.ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000mAh గా ఉంది.10W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాల సెటప్ తో అందుబాటులో ఉంది.
ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్( 13 mega pixel ) కాగా, సెకండరీ సెన్సార్ కూడా ఉంది.ఇక సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 5 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది.IP 54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు అందించారు.4జీ, వైఫై, బ్లూటూత్, జిపిఎస్, 3.5 mm ఆడియో జాక్, USB టైప్-C పోర్టు లాంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్ కు పక్క భాగంలో అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫిలిప్పీన్స్( Philippines ) లో 3599 ఫిలిప్పీన్స్ పెసోలు గా ఉంది.మన భారత కరెన్సీలో అయితే సుమారుగా రూ.6000 గా ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ మిడ్నైట్ బ్లాక్, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో ఉంటుంది.భారత మార్కెట్లో ఇంకా లాంచ్ కాలేదు.త్వరలోనే భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని రియల్ మీ వైస్ ప్రెసిడెంట్ కీ ఛేజ్ తెలిపారు.